మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఏసీఏ అద్యక్షుడు, ఎంపీ కేశినేని శివ నాథ్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో మంగళగిరి క్రికెట్ స్టేడియం అభివృద్ధి తో పాటు, రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి 16 అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం విజయవాడ, అనంతపురం, వైజాగ్ లో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభ కలిగిన క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తామని ఎంపీ కేశినేని తెలిపారు.