చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సెప్టెంబర్ 2026లో వాషింగ్టన్‌లో ఈ ప్రతిష్టాత్మక అధికారిక పర్యటన చేపట్టారు. సుమారు 11 ఏళ్ల విరామం తర్వాత జిన్‌పింగ్ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన సందర్భంగా, ట్రంప్ అరుదైన రీతిలో విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఇక ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలతో పాటు పరస్పరం ఇచ్చుకున్నగిఫ్ట్స్ తో పాటు వైట్‌హౌస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు అందరి దృష్టిని ఆకరిషించాయి. వైట్‌హౌస్ ఈస్ట్ రూమ్‌లో జరిగిన విందు సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడికి అమెరికా జాతీయ చిహ్నమైన ‘బాల్డ్ ఈగిల్’ శిల్పాన్ని బహుమతిగా అందించారు. చైనా అధ్యక్షుడు కూడా అమెరికాకు ప్రత్యేకమైన కానుకలను ప్రకటించారు. అట్లాంటా జూ కోసం ‘పింగ్ పింగ్’, ‘ఫు షువాంగ్’ అనే రెండు పాండాలను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారురాబోయే ఐదేళ్లలో 1,00,000 మంది అమెరికన్ విద్యార్థులను చైనాలో చదువుకోవడానికి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. వైట్‌హౌస్ ఈస్ట్ రూమ్‌లో జిన్‌పింగ్ దంపతుల కోసం ట్రంప్ దంపతులు అత్యంత విలాసవంతమైన స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా, చైనా రాజకీయ ప్రముఖులతో పాటు టెక్ దిగ్గజాలు కూడా ఈ విందులో పాల్గొన్నాయి. ఇద్దరు అగ్రనేతల కలయిక కావడంతో, భోజన మెనూను కూడా ఎంతో స్పెషల్ గా డిజైన్ చేశారు. ఇందులో అమెరికన్, చైనీస్ రుచుల కలయికను అత్యద్భుతంగా పొందుపరిచారు. వైట్ హౌస్ అధికారికంగా విడుదల చేసిన మెనూ ప్రకారం.. మెయిన్ కోర్సులో నువ్వులతో చేసిన బాస్ చేప, క్రిస్పీ బాక్ చోయ్ ఒక రకమైన చైనీస్ క్యాబేజీ, పసుపు గుమ్మడితో చేసిన వెలౌట్, అడవి పుట్టగొడుగులతో చేసిన ఫ్రికాసీ, క్రిస్పీ పాన్సెట్టా, రోస్టెడ్ గార్డెన్ ఎగ్ ప్లాంట్ వంటి నోరూరించే వంటకాలను ఏర్పాటు చేశారు. ఇక డెజర్ట్స్ విషయానికి వస్తే.. వెనీలా క్రిమెక్స్, వైట్ హౌస్ హనీ క్రీమ్, వాల్ నట్ ఫ్రాంగీపేన్, చెర్రీ కాన్ ఫిట్ లాంటి అద్భుతమైన స్వీట్స్ ను అతిథులకు అందించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు కదా.. ఈ విందు దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. టెక్ దిగ్గజాలను వెంటబెట్టుకుని మరీ చైనా అధినేతకు ట్రంప్ ఇచ్చిన ఈ స్పెషల్ ట్రీట్.. భవిష్యత్తులో గ్లోబల్ బిజినెస్ రూపురేఖలను ఎలా మార్చబోతోందో వేచి చూడాలి. ఇక జిన్‌పింగ్ అమెరికా పర్యటన ప్రపంచ రాజకీయాలలో చర్చనీయంశంగా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత అమెరికాలో అధికారికంగా అడుగుపెట్టిన ఆయన పర్యటనపై అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనించింది. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ప్రస్తుతం నడుస్తున్న వాణిజ్య పోటీ, దౌత్యపరమైన వ్యూహాలు మరియు తీవ్రమవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఈ పెద్ద దేశాల అధినేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరుదేశాల సంబంధాలలో మార్పులు భవిష్యత్తు అంతర్జాతీయ రాజకీయ వైఖరిని సరికొత్త శిఖరాల వైపు నడిపించేందుకు ఈ భేటీ ఒక ప్రాతిపదికగా ఉపయోగపడుతుందని జియో పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.