యూ.ఎన్ లో పాక్ పరువు తుస్…భారత జర్నలిస్ట్ దెబ్బకు  తోకముడిచిన పాక్ ప్రధాని

Spread the love

ఉగ్రవాదానికి ఎప్పుడు కేంద్రబిందువుగా ఉండే పాకిస్తాన్ ప్రపంచం ముందు మాత్రం తమకే పాపం తెలియదన్నట్లు నటిస్తూ ఉంటుందన్న సంగతి ప్రపంచమంతా తెలిసిందే. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ అంతర్జాతీయ వేదికలపై మాత్రం మేమే ఉగ్రవాద బాధితులం అంటూ మొసలి కన్నీరు కరుస్తుంటుంది.  ఇటువంటి అబద్దాలు చెబుతూ ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ఎన్నోసార్లు భంగపడిన సందర్భాలు మనం చూశాం. తాజాగా ఐక్యరాజ్యసమితి  సర్వప్రతినిధి సభలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఇలాంటి ఘోర అవమానమే ఎదురైంది. ఒక ఇండియన్ జర్నలిస్ట్ అడిగిన సూటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక, పాక్ ప్రధాని తలదించుకుని పారిపోయిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. ఐక్యరాజ్యసమితి సాగధారణ సభ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయానికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వచ్చారు. సమావేశాల అనంతరం ఆయన బయటకు వస్తున్న సమయంలో ఒక భారతీయ జర్నలిస్ట్ ఆయనను సూటిగా ఒక ప్రశ్న అడిగారు. ఉగ్రవాదులకు మీ దేశంలో ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు మానేస్తారు? అంటూ నేరుగా ప్రశ్నించారు. ఈ పదునైన ప్రశ్నకు బదులిచ్చేందుకు పాక్ ప్రధాని ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. దాన్ని వినిపించుకోనట్లుగా ముందుకు నడిచారు. అయితే ఆ జర్నలిస్ట్ అక్కడితో వదల్లేదు. షెహబాజ్ షరీఫ్ వెళ్తుండగా మళ్లీ మైక్ పట్టుకుని వెంటపడ్డారు. లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ ను మీ ప్రభుత్వం ఎప్పుడు విచారిస్తుంది? అని గట్టిగా అడిగారు. హఫీజ్ సయీద్ పేరు వినగానే పాక్ ప్రధాని ముఖంలో రంగులు మారిపోయాయి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక, అక్కడే ఉంటే మీడియా తనను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్న భయంతో షెహబాజ్ షరీఫ్ అస్సలు పట్టించుకోకుండ ా అక్కడి నుంచి అత్యంత వేగంగా వెళ్లిపోయారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

నిజానికి పాక్ ప్రధాని దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే హఫీజ్ సయీద్ లాంటి కరుడుకట్టిన  టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నదే పాకిస్తాన్ ఆర్మీ,  అక్కడి ఐఎస్ఐ  సంస్థ. ఒకవేళ పొరపాటున షెహబాజ్ షరీఫ్ ఆ ఉగ్రవాదికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే, పాకిస్తాన్ వెళ్లగానే ఆయన పదవికే చేటు అనేది తెలిసిందే.  ఆ ఉగ్రవాదుల దయాదాక్షిణ్యాలపైనే పాక్ ప్రభుత్వం నడుస్తోంది అనడానికి ఈ ఒక్క సంఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అందుకే ఉగ్రవాది పేరు వినగానే పారిపోయారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ పడింది. జర్నలిస్ట్ ఒకవైపు పరువు తీస్తే, మరోవైపు భారత ప్రతినిధి సమావేశంలో పాకిస్తాన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేయగా, భారత్ ఎప్పటిలాగే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.  పొరుగు దేశాలపై సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ముందు పాకిస్తాన్ మానుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం మాని, పాక్ ఆర్థిక భారం నుంచి ఎలా బయటపడాలో.. ఆ మార్గాలు అన్వేషించుకోవాలని దాయాదికి భారత్ హితవు పలికింది. ప్రజలకు తినడానికి తిండి లేదు కానీ, ఉగ్రవాదులకు మాత్రం పాకిస్తాన్ లో విఐపి  ట్రీట్మెంట్ దొరుకుతోందని భారత్ అంతర్జాతీయ వేదికపై కడిగిపారేసింది. పాకిస్తాన్ ప్రపంచంలోనే ఉగ్రవాదానికి అతిపెద్ద కేంద్రంగా మారిందని భారత్ స్పష్టం చేసింది. ఇక జర్నలిస్ట్ ప్రస్తావించిన హఫీజ్ సయీద్ ఎంత దారుణ ఉగ్రవాదో తెలిసిందే. 2008లో జరిగిన 26/11 ముంబయి మారణహోమానికి ప్రధాన సూత్రధారి ఈ హఫీజ్ సయీదే. భారత్ ఇప్పటికే అతన్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాదు, గతేడాది జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిలోనూ లష్కరే తోయిబా అనుబంధ సంస్థల హస్తం ఉన్నట్లు తేలడంతో, భారత జాతీయ దర్యాప్తు సంస్థ  రీసెంట్ గా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో హఫీజ్ సయీద్ ను ప్రధాన నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే.    ఉగ్రవాదాన్ని ఒక స్టేట్ పాలసీగా వాడుకుంటున్న పాకిస్తాన్.. ఎప్పటికైనా దానికి భారీ మూల్యం చెల్లించక తప్పదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *