స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Spread the love

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ను ఫ్లాట్ గా ముగించాయి. అంతర్జాతీయ పరిణామాలను అనుసరించి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 50 పాయింట్లు లాభపడి 82,276 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 57 పాయింట్ల లాభం తో 25,482 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.90.93గా కొనసాగుతోంది. కీలక షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజస్ షేర్లు రాణించాయి. గత కొన్ని రోజులుగా డీలాపడుతున్న ఐటీ స్టాక్స్‌లో ఈరోజు రికవరీ కనిపించింది. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కొత్త టారిఫ్ వ్యాఖ్యల వల్ల గ్లోబల్ మార్కెట్లలో కొంత అనిశ్చితి నెలకొంది. దీనివల్ల ఉదయం వచ్చిన భారీ లాభాలు చివర్లో తగ్గాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *