‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాతో కొణిదెల నిహారిక నిర్మాతగా తన అభిరుచి ఏమిటో చూపించారు. ఇప్పుడు సెకండ్ సినిమా తో ఆ పేరు ని ఇంకాస్త పై స్థాయికి తీసుకెళ్లే విధంగా ఇప్పుడు రాకాస సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ఒక హారర్ కామెడీ జానర్ స్టోరీ. సంగీత్ శోభన్, నయన్ సారిక, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతాన్ని అనుదీప్ దేవ్ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. విజువల్స్‌లో కొత్తదనం, నటీనటుల ఎంపికలో ఫ్రెష్ ఫీలింగ్ ఉండటం ఈ సినిమాకు ప్రత్యేకతగా కనిపిస్తోంది. తెలుగు సినిమాల్లో హారర్ కామెడీ జానర్ కొంతకాలంగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఈ జానర్ సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించేవి. ఇటీవల ‘కిష్కింద పురి’ సక్సెస్ తర్వాత మళ్లీ ఈ జానర్ పై ఆసక్తి పెరిగింది. ‘రాకసా’ హిట్ అయితే హారర్ కామెడీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి ‘రాకసా’ భయంతో పాటు నవ్వులను కూడా పంచే సినిమా అని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. సంగీత్ శోభన్‌కు ఇది మరో మంచి అవకాశం కావచ్చు. నిహారిక నిర్మాతగా మరోసారి తన మార్క్ చూపిస్తుందా? దర్శకురాలు మనసా శర్మ తొలి ప్రయత్నంలో విజయం సాధిస్తారా? అన్నది చూడాలి. ‘రాకసా’ సినిమా 2026 ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది. అప్పటివరకు టీజర్‌తోనే ఆసక్తిని పెంచిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.