మీరు ఎక్కడ ఉన్నా,ఏపీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది:ప్రవాసాంధ్రులకు భరోసా

Spread the love

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ పౌరుల క్షేమం  కోసం కీలక చర్యలు తీసుకుంటోంది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం చర్యలు చేపట్టినట్లు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గల్ఫ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వలన ఎయిర్ పోర్టుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఏపీ  నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (కో ఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. లోకల్ గా  ఉన్న ఇండియన్ ఎంబసీ సేవలను, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లను ఉపయోగించుకోవాలని  సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందిపడుతున్న వారు తమ వివరాలను ఏపీ ఎన్ఆర్డీఎస్ 24/7 హెల్ప్ లైన్  0863-2340678, వాట్సాప్ +91 85000 27678 నంబర్లకు తెలియజేయవచ్చని, helpline@apnrts.com ద్వారా సంప్రదించిసాయం  పొందాలని మంత్రి పేర్కొన్నారు. దయచేసి సంయమనంతో ఉండండి, ఎవరూ భయపడవద్దు. మీరు ఒంటరి వారు కాదు. మీకు అవసరమైన ఏ సమయంలోనైనా మద్దతు, మార్గదర్శకత్వం మరియు సహాయం అందించడానికి apnrtsofficial ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. అధికారిక మార్గాల ద్వారా మాతో కనెక్ట్ అయి ఉండండి మరియు సహాయం కోసం ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించండి. మీరు ఎక్కడ ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *