మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘పెద్ది’. ఈ మూవీలో చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది.ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈచిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఇందులో చరణ్ డ్యాన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించింది.ఈ పాట తెలుగు లిరికల్ వీడియో ఇప్పటికే 175 మిలియన్ వ్యూస్ దాటేసింది. కాగా, తాజాగా ఈ మూవీ నుండి మరో సాంగ్ పెద్ది సెకండ్ సింగిల్ ‘రయ్ రయ్ రా రా’ అనే సాంగ్ ను విడుదల చేశారు. మ్యూజిక్ చరణ్ డ్యాన్స్ ఈ పాటను కూడా బ్లాక్ బస్టర్ గా చేశాయి. అప్పుడే సోషల్ మీడియాలో ఈ సాంగ్ దుమ్ముదులిపేస్తోంది. అన్ని భాషల్లో దేశవ్యాప్తంగా ఈ సినిమా 2026 ఏప్రిల్ 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.