ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కు ప్రధాన కేంద్రంగా మంగళగిరి స్టేడియం

Spread the love

మంగళగిరి స్టేడియం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కు ప్రధాన కేంద్రంగా మారునుంది. 2026 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ – 5 త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానుంది… విశాఖపట్నం, మంగళగిరి, కడప స్టేడియాలలో మ్యాచులు జరగనున్నాయి. ఈరోజు మంగళగిరి స్టేడియాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ  కార్యదర్శి సాన సతీష్ బాబు, పరిశీలించారు. మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని అధునాతన స్టేడియం గా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టారు.  ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ – 5 తొలి మ్యాచ్ ప్రారంభం నాటికి మంగళగిరి స్టేడియంను  ఆధునీకరించేందుకు ఈ రోజు పనులు ప్రారంభించారు. విశాఖపట్నం స్టేడియంలో 45 రోజుల్లో పూర్తిగా ఆధునికరించామని .అదేవిధంగా రానున్న రెండు నెలలలో, మే నెల నాటికి మంగళగిరి స్టేడియం ఆధునికరణ పనులు పూర్తి చేస్తామని కేశినేని శివనాథ్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.  ఆధునికరించిన స్టేడియంను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ చేతుల మీదగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *