భారత్  శక్తి  ముందు ఆ దేశాల కూటమి జూజూబీ..!

Spread the love

సింహం వంటి భారత్ ముందు నక్కల సమూహం కలిసి గుంపుగా వచ్చినట్లుంది పాకిస్తాన్ పరిస్థితి. ఒంటరిగా యుద్ధం చేస్తే భారత్ చేతిలో భంగపాటు తప్పదని పాకిస్తాన్‌ కు ఎప్పుడో అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఇస్లామిక్ దేశాల సెంటిమెంట్ రగిల్చి, ఇతర దేశాలను రెచ్చగొట్టి దాని వెనుక దాగి ఆట్లాడొచ్చని చూస్తోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్, సౌదీ అరేబియా,తుర్కియే దేశాలు కలిసి ఒక కొత్త మిలిటరీ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ  ముగ్గురిలో ఏ ఒక్కరి మీద దాడి జరిగినా.. అది ముగ్గురి మీద జరిగినట్లే, మేం కలిసి ఎదుర్కొంటాం అంటూ తాటాకు చప్పుళ్లు చేస్తున్నాయి. ఈ కూటమి వెనుక ఉన్న మెయిన్ టార్గెట్ భారతదేశమే అని అందరికీ తెలుసు. అయితే, గ్లోబల్ రక్షణ రంగ నిపుణులు మాత్రం  ఈ కూటమిని చూసి పగలబడి నవ్వుతున్నారు. పాకిస్తాన్ కు తోడుగా రెండు కాదు కదా, ఏకంగా 50 దేశాలు కలిసొచ్చినా సరే భారతదేశం ముందు కనీసం నిలబడలేవని తేల్చిచెప్పేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తోనే టీజర్ చూపించిన భారత్ ముందు ఇవి కుప్పి గంతులేనని పక్కకు తోసేస్తున్నారు. ముందుగా ఈ పాకిస్తాన్ ,  సౌదీ అరేబియా దేశాల మధ్య ఒక రక్షణ ఒప్పందం ఉంది. అయితే, కొన్నేళ్ల క్రితం సౌదీ అరేబియాలోని అమెరికా రక్షణ స్థావరాలపై, అలాగే చమురు కేంద్రాలపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ భీకర దాడులు చేశారు. ఒప్పందం ప్రకారం.. సౌదీకి రక్షణగా అప్పుడు పాకిస్తాన్ రంగంలోకి దిగాలి. కానీ పాకిస్తాన్ సైన్యం తోకముడిచి ఇంట్లో కూర్చుంది. ఎందుకు అంటే? దానికి కారణాలు రెండు.  మొదటిది.. ఒకవైపు భారతదేశం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌ను కోలుకోలేని చావుదెబ్బ కొట్టింది. భారత సైన్యం భయంతో వణికిపోతున్న పాక్.. తన బలగాలను బోర్డర్ నుంచి కదిలించే సాహసం చేయలేకపోయింది. ఇక రెండోది ఇరాన్ తో పాకిస్తాన్ కు నేరుగా సరిహద్దు ఉంది. ఒకవేళ సౌదీకి సపోర్ట్ గా పాకిస్తాన్ వెళ్లి ఉంటే.. ఇరాన్ తన భారీ మిస్సైల్స్ తో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌నే శ్మశానంగా మార్చేది. ఓ పక్క పవర్‌ఫుల్ ఇండియా, మరో పక్క అగ్రెసివ్ ఇరాన్.. ఈ రెండు సింహాల మధ్య చిక్కుకున్న పాకిస్తాన్, ఇతర దేశాలకు వెళ్లి సాయం చేసేంత దమ్ము లేని ఒక ఫెయిల్యూర్ స్టేట్ అని సౌదీకి అప్పుడే  అర్థమైపోయింది. పాకిస్తాన్, సౌదీ కూటమి పనికిరాదని తేలడంతో.. ఇప్పుడు ఇందులోకి తుర్కియే ఎంట్రీ ఇచ్చింది. తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. తనను తాను యావత్ ముస్లిం ప్రపంచానికే లీడర్  గా ఊహించుకుంటున్నాడు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ ఇండియాపై విషం చిమ్ముతున్నాడు. కానీ, తుర్కియే సొంత పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. తుర్కియేకి సొంత దేశంలోనే కుర్దుల  రూపంలో ఒక అతిపెద్ద అంతర్గత శత్రువు ఉన్నాడు. దేశాన్ని విడగొట్టాలని కుర్దులు పోరాడుతున్నారు. వారిని కంట్రోల్ చేయడానికే తుర్కియే ఆర్మీకి, వనరులకు సరిపోతోంది. మరోవైపు, గాజా యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ తో తుర్కియేకు బద్ధ శత్రుత్వం ఏర్పడింది. తుర్కియే నాటో  లో సభ్యదేశమే అయినప్పటికీ, ఒకవేళ ఇజ్రాయెల్‌తో కనుక ఏమైనా డైరెక్ట్ గా గొడవ వస్తే.. అమెరికా సహా ఏ నాటో దేశం కూడా తుర్కియేకు సపోర్ట్ గా రాదు. ఇలా తనకే దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న తుర్కియే.. పాకిస్తాన్‌కు సహాయం చేసి, భారతదేశంతో యుద్ధం చేస్తుందనుకోవడం హాస్యాస్పదమని ప్రపంచ రాజకీయ  నిపుణులు చెబుతున్నారు.

ఈ కూటమిలో ఆర్థికంగా బలంగా ఉన్న ఒకే ఒక్క దేశం సౌదీ అరేబియా. కానీ, అది ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌కు వ్యతిరేకంగా వెళ్లదు. ఎందుకంటే, సౌదీ అరేబియా , భారతదేశం మధ్య ఇప్పుడు అత్యంత పటిష్టమైన దౌత్య ,వాణిజ్య సంబంధాలు  ఉన్నాయి. ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న ఇండియా లాంటి గ్లోబల్ పవర్ ను వదులుకుని.. చిప్ప చేతపట్టుకుని అడుక్కుంటున్న పాకిస్తాన్ కోసం సౌదీ తన భవిష్యత్తును నాశనం చేసుకోదని భారత దౌత్యవేత్తలు స్పష్టం చేస్తున్నారు.ఈ మూడు దేశాల కూటమి విఫలం అవ్వడానికి అసలైన కారణం వాటి భౌగోళిక స్థితి. పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియేలు పక్కపక్కన లేవు.. వీటి మధ్య వేలాది కిలోమీటర్ల దూరం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ మీద దాడి జరిగితే.. సౌదీ, తుర్కియేల సైన్యాలు సముద్రం, ఆకాశ మార్గాల గుండా రావాలి. అలా వచ్చేలోపు భారత సైన్యం వాళ్ళను బూడిద చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్-4 మిలిటరీ పవర్స్ లో భారతదేశం కూడా ఒకటి. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలతో సమానంగా మన సైనిక శక్తి ఉంది. భారత సైన్యం ఎంతటి సవాళ్లనైనా ఎదుర్కోగలదు. అలాగే  ఇండియన్ నేవీకి ఉన్న స్ట్రైకింగ్ కెపాసిటీ ముందు.. ఈ మూడు దేశాల నావికాదళాలు కలిసినా చేసేదేం లేదు. 2025 మే 6 ,  7 తేదీల్లో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దీనికి నిదర్శనం. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు  చేసింది. ఏ ఒక్క దేశమైనా మన భూభాగంపై దుస్సాహసానికి దిగితే ఇక వారి గతి అంతే  అణు సామర్థ్యం, అత్యాధునిక క్షిపణి వ్యవస్థ మన సొంతం. కాబట్టి పాకిస్తాన్ ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా అది తమ ప్రజల ముందు బిల్డప్ లు ఇచ్చుకోవటానికే తప్ప, భారత్ ముందు నిలవలేవన్నది  వాస్తవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *