తెలుగు చిత్ర పరిశ్రమలో జోరు చూపిస్తున్న గురు శిష్యులు

Spread the love

టాలీవుడ్‌లో ఇప్పుడు కొందరు కొత్త తరానికి చెందిన దర్శకులు జోరు చూపిస్తున్నారు. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ ఇండస్ట్రీలో తమ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ల వద్ద శిష్యులుగా పనిచేసిన యువ దర్శకులు ఇప్పుడు తమ సొంత శైలితో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గతంలో ఒక దశలో లెజెండరీ దర్శకులు దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణ గురు  శిష్యుల హవా తెలుగు చిత్ర పరిశ్రమలో బలంగా కనిపించేది. అలాగే దర్శకుడు సాగర్ వద్ద పనిచేసిన శిష్యులు కూడా ఒక సమయంలో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించారు. ఇక కె.రాఘవేంద్ర రావు  వంటి ప్రముఖ దర్శకుడి శిష్యులలో పెద్దగా దర్శకులుగా ఎదిగిన వారు తక్కువగానే ఉన్నారని అంటారు. అయితే ఆయన దగ్గర నుంచి వచ్చిన ఒక గొప్ప దర్శకుడు మాత్రం ఎస్.ఎస్.రాజమౌళి.  ఐతే మెల్లగా ఆ పాత తరం దర్శకుల ప్రభావం తగ్గుతూ వచ్చింది. వారిలో కొంతమంది ఇప్పుడు సినిమాలు చేయడం కూడా తగ్గించారు. మరికొందరు చాలా కాలంగా మేకింగ్‌ కు దూరంగా ఉన్నారు. దీంతో ఒక దశలో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ల శిష్యుల కొరత ఏర్పడినట్టే కనిపించింది. కానీ ఇప్పుడు కొత్త తరానికి చెందిన దర్శకులు ఆ లోటును భర్తీ చేస్తూ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్నారు. కొందరు భారీ పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటే, మరికొందరు కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ కొత్త తరంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సుకుమార్ లెక్కల మాస్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ వద్ద పనిచేసిన శిష్యులు ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి హంగామా చేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి వచ్చిన దర్శకుల్లో ముఖ్యంగా బుచ్చిబాబు సాన శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు ఇంకా హుస్సేన్ షా కిరణ్  పేర్లు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి.

వీరిలో మొదటగా భారీ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు. ఆయన మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేశారు. తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విజయంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోల దృష్టి కూడా ఆయనపై పడింది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’ తెరకెక్కిస్తున్నారు. ఇక మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నేచురల్ స్టార్ నాని  హీరోగా The Paradise అనే భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పారడైస్ సినిమా తరవాత ఏకంగా మన మెగాస్టార్ ని లైన్ లో పెట్టుకున్నాడు… మెగాస్టార్ నే ఇంప్రెస్స్ చేసాడు అంటే గ్రేట్ కదా! మరోవైపు సుకుమార్ శిష్యుడైన కార్తిక్ దండు కూడా ఇప్పుడు భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నారు. ఆయన దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ‘వృషకర్మ’ రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. నాగచైతన్య ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సుకుమార్ శిష్యుల్లో మరో దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *