మెగా డాటర్ కు మెగాస్టార్ విషెస్ 

Spread the love

మెగాస్టార్ కూతురుగానే కాకుండా మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా కొనసాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుస్మిత కొణిదెల. ఇటీవల వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర నిర్మాణంలో భాగమైన ఆమె తన తండ్రికి భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వేలెడు ఉన్నప్పటి నుండి నా వేలు పట్టుకుని నడిచిన ఆ చిన్నారి, నేడు ఇంతటి బలమైన, హుందాతనమున్న, బాధ్యతాయుతమైన మహిళగా ఎదగడం చూస్తుంటే గర్వంగా ఉంది. ఒక తండ్రిగా నాకు అత్యంత ప్రత్యేకమైన క్షణం ఏదంటే… నా సినిమాలను చూస్తూ పెరిగిన నువ్వు, ఇప్పుడు ఒక సినిమాను నిర్మించి, నాకు ఒక చిరస్మరణీయమైన బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించడం. అది నన్ను ఎంతో ప్రత్యేకం‌గా, గర్వపడేలా చేసింది.నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఆయురారోగ్యాలతో, ఆనందంతో నిరంతర విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని మన మెగాస్టార్ విషెస్ తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *