గత రెండు రోజులుగా కొనసాగుతున్న నష్టాలకు బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో భారీ లాభాలతో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లు సుమారు ₹6 లక్షల కోట్ల మేర లాభపడ్డారు.ఈరోజు ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 639.82 పాయింట్లు లాభపడి 78,205.98 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 233.55 పాయింట్ల లాభంతో 24,261.60 వద్ద స్థిరపడింది.ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గుదలతో దేశీయ మార్కెట్లకు భారీ ఊరట లభించింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు త్వరలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉండనే వార్తలు మార్కెట్ జోష్ కు కలిసొచ్చాయి. ఆటోమొబైల్ రంగం 3% పైగా లాభపడి టాప్ పెర్ఫార్మర్గా నిలిచింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు కూడా రాణించాయి. ఇండిగో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్స్ ప్రధానంగా లాభాలతో ముగించాయి.