శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతోకాలంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా, శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణించే మూడు ముఖ్యమైన రైళ్లకు ఇప్పుడు కీలక స్టేషన్లలో రైల్వే శాఖ హల్ట్ లు మంజూరు చేశారని తెలిపారు. 58505/06 గుణుపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలు ఇకపై హరిశ్చంద్రపురం వద్ద, 1825/26 బెరహంపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలు మందస రోడ్ వద్ద, 18117/18 రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ రైలు పాతపట్నం వద్ద ఆగుతాయన్నారు. ఈ హల్ట్ ల ద్వారా జిల్లాలోని ఇంటర్నల్ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మరియు విశాఖపట్నం వంటి ప్రధాన పట్టణాలకు విద్య, వైద్యం, ఉపాధి మరియు వ్యాపార అవసరాల కోసం ప్రయాణం మరింత సులభమవుతుందని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త స్టాపేజీల ద్వారా జిల్లాలోమెరుగైన రైల్వే కనెక్టివిటీ మరియు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ప్రాంతానికీ అభివృద్ధి చేరేలా మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు.