ప్రపంచ పారా గ్రాండ్ ప్రి లో రాణించిన భారత అథ్లెట్లు

Spread the love

ప్రపంచ పారా గ్రాండ్ ప్రి లో భారత పారా జావెలిన్ స్టార్సుమిత్ అంటిల్ గోల్డ్ మెడల్ తో సత్తా చాటాడు. ఫైనల్ లో సుమిత్ అత్యద్భుతంగా 69.25 మీటర్ల దూరం త్రో చేసి టాప్ లో నిలిచాడు. భారత్ కు చెందిన మరో ఇద్దరు పుష్పేంద్ర సింగ్ 51.96 మీటర్లు, పూనమ్ రామ్ 49.48 మీటర్లు విసిరి వరుసగా సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. మేన్స్ టీ 13 400 మీటర్లలో సుబోధ్ భట్ గోల్డ్ సాధించాడు. 51.88 సెకన్లలో టార్గెట్ ను చేరుకున్నాడు. ప్రియాంశు కౌశిక్ 53.19 సెకన్లు, అవ్నిల్ కుమార్ 56.91 సెకన్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఉమెన్స్ టీ 11/12 400 మీటర్లలో తేజల్ బెన్ 57.53 సెకన్లలో గోల్డ్ తో అదరగొట్టింది. లలిత 1 నిమిషం 7.92 సెకన్లలో, షాలిని 1 నిమిషం 16.79 సెకన్లలో వరుసగా సిల్వర్,  బ్రాంజ్ లు కైవసం చేసుకున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *