భారీ నష్టాలతో తగ్గిన సూచీల జోరు

Spread the love

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో భారీ నష్టాలతో ముగిశాయి. మిడిల్ ఈస్ట్ లోని  ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు ముడి చమురు ధరలు పెరగడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 829 పాయింట్లు నష్టపోయి 76,034 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ  227 పాయింట్ల నష్టంతో  23,639 వద్ద స్థిరపడింది. నేటి భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.92.25గా కొనసాగుతోంది. రిలయన్స్, హెచ్.సీ .ఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ షేర్లు లాభపడ్డాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *