శేఖర్ మాస్టర్ ఇక ఒక డైరెక్టర్… అయన ఫస్ట్ సినిమా ఎవరితో తెలుసా???

Spread the love

శేఖర్ మాస్టర్… ఈ డాన్స్ మాస్టర్ పేరు వింటేనే మనకి చాల చాల మంచి బ్లాక్బస్టర్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. కొరియాగ్రఫీతో తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆయన డైరెక్టర్ గా కూడా మారుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో డాన్స్ మాస్టర్లు దర్శకులుగా మారడం కొత్త విషయం కాదు. గతంలో చాలా మంది ప్రముఖ కొరియోగ్రాఫర్లు కూడా ఒక దశలో దర్శకులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. డాన్స్ తో ప్రేక్షకులను అలరించిన వారు తర్వాత డైరెక్షన్ వైపు అడుగులు వేయడం సహజమే. ఇప్పుడు అదే జాబితాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా చేరబోతున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. 

శేఖర్ మాస్టర్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యంత బిజీగా ఉండే డాన్స్ మాస్టర్లలో ఒకరు. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో పాటల కొరియోగ్రఫీ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఆయనదే. తన ప్రత్యేకమైన స్టెప్స్, ఎనర్జిటిక్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చాలా కాలంగా టాలీవుడ్‌లో టాప్ స్థాయిలో కొనసాగుతున్నారు. సినిమాలతో పాటు టెలివిజన్‌లో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. పలు డాన్స్ రియాలిటీ షోలలో జడ్జిగా కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యారు. తన సరదా మాటలు, సింపుల్ స్వభావంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన డైరెక్షన్ వైపు అడుగులు వేయబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో ఆసక్తిని రేపుతున్నాయి.

ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. ప్రముఖ నృత్య దర్శకుడు నటుడు ప్రభు దేవా  కుమారుడు రిషిల్ రాఘవేంద్ర దేవా  త్వరలో హీరోగా వెండితెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ యువ హీరో కోసం శేఖర్ మాస్టర్ ప్రత్యేకంగా ఒక కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇటీవల ఆయన ప్రభుదేవాను కలిసి ఆ కథను వివరంగా చెప్పినట్లు కూడా టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే మే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం. ఏదేమైనా, డాన్స్ మాస్టర్‌గా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న శేఖర్ మాస్టర్ ఇప్పుడు దర్శకుడిగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త హీరోను పరిచయం చేస్తూ మ్యూజిక్, డాన్స్‌తో నిండిన ప్రేమకథను తీసుకురావాలనే ప్రయత్నం నిజంగా సక్సెస్ అయితే టాలీవుడ్‌కు మరో కొత్త దర్శకుడు దొరికినట్టే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *