మెగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఉండే ఛాన్స్?

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  అభిమానులకు ఈసారి మార్చి నెల మరింత ప్రత్యేకంగా మారబోతోందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు వరుస సర్ప్రైజ్‌లు ఇవ్వాలని చిత్రబృందాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన నటిస్తున్న రెండు భారీ ప్రాజెక్టులు ఉండటంతో ఆ రోజు అభిమానులకు డబుల్ ట్రీట్ లభించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా ‘రంగస్థలం’ వంటి భారీ విజయానంతరం రామ్ చరణ్ మరోసారి స్టార్ దర్శకుడు సుకుమార్ తో కలసి పనిచేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై  దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC17 సినిమాకు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించినఏదైనా  పోస్టర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ఇక మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మరో భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉందని సమాచారం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా త్వరలో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని కూడా టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలతో  పాటు గ్లింప్స్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ అదే రోజున RC17 అప్‌డేట్‌తో పాటు పెద్ది టీజర్ కూడా విడుదలైతే, రామ్ చరణ్ అభిమానులకు అది నిజంగా డబుల్ ధమాకా అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ రెండు అప్‌డేట్లు పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *