ఐపీఎల్..ఇక చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడనున్నసంజూ శాంసన్  

Spread the love

వేసవిలో వినోదాన్ని అందించే అతిపెద్ద క్రీడా సంబరం ఐపీఎల్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో అత్యద్భుతంగా రాణించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ ఈ సీజన్ నుండి తాను ఇన్నేళ్లుగా ప్రాతినిథ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్ ను వీడి చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడనున్నాడు. అతను గతేడాది ట్రేడ్ డీల్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ కు చేరిన విషయం తెలిసిందే. 2018 నుండి 2025 వరకు రాజస్థాన్ రాయల్స్ కు అతను ఆడాడు. ఐపీఎల్ లో సంజూ శాంసన్ 177 మ్యాచ్ లలో  30.95 యావరేజ్ తో 4,704 పరుగులు చేశాడు. హయ్యెస్ట్ స్కోర్ 119. కాగా, 3 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు 379 ఫోర్లు, 219 సిక్స్ లు ఉన్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *