ప్రపంచ టీ 20 క్రికెట్ లో భారత్ ది బెస్ట్ 

Spread the love

ప్రస్తుతం ప్రపంచంలోనే టీ 20 ఫార్మాట్ లో భారత్ అత్యంత బలమైన జట్టు అని దిగ్గజ క్రికెటర్లు కూడా కితాబిస్తున్నారు. వరుసగా ఈ ఫార్మాట్ లో రెండు ప్రపంచకప్ లను గెలుచుకుని భారత్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆ విధంగా మన ఆధిపత్యం ఈ ఫార్మాట్ లో కొనసాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో దేశంలో చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్  ఉన్నారని, టీ20ల్లో భారత్ ఒకే సమయంలో రెండు లేదా మూడు టీమ్ లను బరిలోకి దించగలదని టీమిండియా టీ 20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. 2024లో సూర్య టీ20 టీమ్ కెప్టెన్ అయ్యాక టీమిండియా 52 మ్యాచ్ లలో  42 గెలిచింది. ప్రస్తుత టీ20 టీమ్ భారత అత్యుత్తమ టీ20 టీమ్ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. టీమ్ లోకి నిరంతరం టాలెంటెడ్ ప్లేయర్స్ వస్తూనే ఉన్నారు. ఐపీఎల్ దేశవాళీ క్రికెట్ నుండి  ప్రతి ఏటా ఎంతో మంది ప్లేయర్స్  దూసుకొస్తున్నారు. టీ20 క్రికెట్ లో భారత్ ఎన్నంటే అన్ని టీమ్ లను తయారు చేయొచ్చు. దేశంలో టాలెంటెడ్ ప్లేయర్స్ కు కొదవ లేదు. రెండు మూడు ఫైనల్ టీమ్ లను  బరిలోకి దించవచ్చు. భారత క్రికెట్ వ్యవస్థాగతంగా చాలా బలంగా ఉన్నదనే విషయాన్ని క్రీడా విశ్లేషకులు కూడా  పేర్కొంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *