తుదిదశకు ‘మూలపేట పోర్టు’ పనులు

Spread the love

శ్రీకాకుళం జిల్లాలోని ములపేట పోర్టు నిర్మాణ పనులు తుది దిశకు చేరుకున్నాయని ఆ ప్రాంతం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దూరదృష్టి నాయకత్వంలో, ఈ పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు.  పోర్ట్ అభివృద్ధిలో రోడ్డు మరియు రైలు కనెక్టివిటీ అత్యంత కీలకం. ఈ ప్రధాన మౌలిక వసతుల కోసం 385 ఎకరాల ఉప్పు భూమి అవసరం ఉంది. ఈ భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడం సంతోషకరమని ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.  ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీకాకుళం జిల్లా మరియు ఉత్తరాంధ్ర ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలంలో నిర్మించబడుతోంది. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ముఖచిత్రం మారిపోనుంది. దీనిని మొదట ‘భావనపాడు పోర్టు’ అని పిలిచేవారు, కానీ స్థానికుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం దీని పేరును ‘మూలపేట పోర్టు’గా మార్చింది. ఏప్రిల్ 2023లో ఈ పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *