కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ ఫైర్ 

Spread the love

ఏపీ లోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఇటీవల పలు వివాదాల్లో కూటమి నేతలపైన వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జగన్ వారిపై ఫైర్ అయ్యారు. టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌. డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడ్డ ఏకైక ఎంపీ. ఆయనేనని  పార్లమెంటు చరిత్రలో గతంలో అది లేదని మండిపడ్డారు. గతంలో చాలా జరిగాయి.చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడని ప్రశ్నించారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌.. తనపై అత్యాచారం చేశాడని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేసింది. నో యాక్షన్‌. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్‌ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మీద నో యాక్షన్‌. మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్‌ చేసిన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే నసీర్‌ మీద నో యాక్షన్‌. టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే నో యాక్షన్‌. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ. అక్కడా నో యాక్షన్‌. ప్రస్తుత టీటీడీ చైర్మన్‌ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ, ఫొటోలతోనూ అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్‌. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్‌ తీసుకుంటూ హైదరాబాద్‌లో పట్టుబడితే నో యాక్షన్‌. అంటూ జగన్ ఫైర్ అయ్యారు. నారా లోకేష్, బాలకృష్ణల పైన కూడా జగన్ విమర్శలు గుప్పించారు.  ఈ ప్రభుత్వ మైండ్‌సెట్‌ సరిగ్గా లేదని ఆరోపించారు.  విద్యా రంగాన్ని నాశనం చేశారని  ఇంగ్లిష్‌ మీడియమ్‌ తీసేశారని దుయ్యబట్టారు.  విద్యాదీవెన, వసతి దీవెన, రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా లేదని ఆక్షేపించారు. గిట్టుబాటు ధర, పేదలకు ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ గాలికెగిరిపోయిందని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్యం చేయడం లేదు. రూ.6 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.  వీరి మైండ్‌సెట్‌ పేదలు, అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలని కాదని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు.  జగన్‌ 2.ఓ లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *