ఉగాది పర్వదినాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువతకు కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు. 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని నిర్దేశిత సమయంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోందని ఈ 20 నెలల కాలంలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ, కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించినప్పుడు యువత కళ్లలో ఆనందం చూసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫాం సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయనున్నాము. ఇక ఉద్యోగార్థులు ప్రిపరేషన్ లో నిమగ్నం కావాలని సూచించారు.