తాజాగా రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా ఎలా ఉందంటే… పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు వెంటనే ‘గబ్బర్ సింగ్’ గుర్తుకు వస్తుంది. అదే తరహాలో ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు. ఇక్కడ పాత బస్తి ఎలెమెంట్స్, పాకిస్తాన్ టెర్రరిస్ట్స్ ని చంపడం, అసలు వాళ్ళు మన దేశంలోకి ఇంకా హైదరాబాద్ లోకి ఎలా వస్తున్నారో చూపించడం అన్ని సూపర్… ఆమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి అనేంతగా బయపడ్డాం! అందుకే బల్లగుద్ది మరి చెప్తున్నాం సినిమా చుడండి… ఎంజాయ్ చేయండి!
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచి సినిమా మాస్ మోడ్‌లోకి వెళ్తుంది. ఆయన స్టైల్, డైలాగ్స్, యాక్షన్ అన్ని కలిసి థియేటర్లలో సందడి చేస్తాయి. డ్యాన్స్ ఎపిసోడ్లు, ‘కాలరే ఎత్తరా’ పాట, అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. దర్శకుడు కొన్ని సామాజిక అంశాలపై కూడా సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. రావు రమేష్, గురువుగా KS రవి కుమార్ పాత్రలూ కూడా చాల చాల ముఖ్యం… ఇక సంగీతం విషయానికి వస్తే, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలం ఇచ్చింది. టెక్నికల్‌గా కూడా సినిమా మంచి స్థాయిలో ఉంది. చాలా రోజుల తర్వాత, గౌతమి, ఎల్.బీ.శ్రీరామ్ వంటి నటులు తెరపై కనిపించడం ఒక ఫ్రెష్ ఫీలింగ్. మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ఇక ఫస్ట్ డే కలెక్షస్న్ విషయానికి వస్తే ఈ సినిమా 40 కోట్ల కలెక్షన్ వచ్చింది అని అంటున్నారు… ఇంకా నిర్మాతల నుంచి అధికారిక అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్!