మరో నాలుగు రోజుల్లో భారతీయ క్రికెట్ అభిమానుల ఫేవరేట్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని టీమ్ లు ఇందుకోసం రెడీ అవుతున్నాయి. ప్రాక్టీస్ మొదలెట్టేశాయి. గతేడాది ఫైనల్ చేరి రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈ సారి కూడా గట్టిగానే ఈ మెగా టోర్నీ కోసం రెడీ అవుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఆ టీమ్ కోచ్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు అన్ని విధాలుగా ఫిట్ గా ఉండాలన్నాడు. ఇది ట్రైనింగ్..ఇది ప్రిపరేషన్..మా ఫస్ట్ మ్యాచ్ నుండే మేము ఫిజికల్ గా, టెక్నీకల్ గా, మెంటల్ గా ఫిట్ గా ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే ప్లేయర్స్ చేసే పొరపాట్ల గురించి ప్రస్తావించాడు. ఆటలో అవన్నీ సాధారణమని అన్నాడు. మనమందరం పొరపాట్లు చేస్తుంటాం..అందులో తప్పేం లేదు. ఈ ప్రయాణంలో నేను తప్పులు చేస్తాను..మీరు చేస్తారు. క్యాచ్ లు డ్రాప్ చేస్తారు. బౌలింగ్ లో ఎక్కువ పరుగులు ఇస్తారు. చెత్త షాట్లు ఆడతారు. అయితే గేమ్ ప్లాన్ కు కట్టుబడి ఉన్నంతవరకు మీరు తప్పు చేసినా అది తప్పుకాదు క్రికెట్ లో అవన్నీ సహజమని అది గేమ్ లో భాగమని పేర్కొన్నాడు.