సూరి హీరోగా మైత్రీ మూవీమేకర్స్ సినిమా…ప్రకటించిన నిర్మాణ సంస్థ

Spread the love

పలు చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించి తదనంతరం హీరోగానూ ‘విడుతలై’, ‘మామన్’ వంటి హిట్ చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమాను ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటిస్తూ ఒక కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో హీరో నీటిలో ఉండి చేతిలో ఆయుధాలతో ఉండడం ఆసక్తిరేకిత్తిస్తోంది. Blood  followed the flood అనే వ్యాఖ్యను పోస్టర్ లో పొందుపరిచారు. రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు,తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాణసంస్థ తెలిపింది. ఇది ఈ సంస్థకు తమిళంలో 3వ సినిమా. సూరి 7 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రకటించారు. ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు, సాంకేతిక నిపుణులతో కూడిన మిగిలిన వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *