తెలుగులో ‘వీరభద్రుడు’గా రానున్న సూర్య ‘కరుప్పు’..మే 14న విడుదల 

Spread the love

అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా విలక్షణమైన పాత్రలతో తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరణ పొందుతూ  గత రెండు దశాబ్దాలుగా దూసుకుపోతున్నారు సూర్య. ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం ‘కరుప్పు’. ఆర్.జె.బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. చేతిలో పెద్ద కత్తి పట్టుకుని పవర్ ఫుల్ గా హీరో సూర్య కనిపిస్తున్నారు. ఈ సినిమా మే 14న విడుదల కానుంది. సరికొత్త సంగీత సంచలనం సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగులో సూర్య భారీ హిట్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సమ్మర్ లో ప్రేక్షకులకు మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా సినిమా అలరించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *