భారత క్రికెట్ దిగ్గజాలు ద్రావిడ్, కుంబ్లేలకు చిన్నస్వామి స్టేడియంలో అరుదైన గౌరవం..!

Spread the love

స్టేడియంలోని రెండు ప్రధాన ఎండ్‌ లకు ఈ ఇద్దరు దిగ్గజాల పేర్లను ఖరారు చేశారు. బీఈఎంఎల్ ఎండ్‌ కు ‘రాహుల్ ద్రావిడ్ ఎండ్’ అని పేరు పెట్టగా.. పెవిలియన్ ఎండ్‌ కు ‘అనిల్ కుంబ్లే ఎండ్’ అని పేరు పెట్టారు.  వీరితో పాటు మాజీ క్రికెటర్ శాంత రంగస్వామి పేరు మీద కూడా స్టాండ్‌ ను ఏర్పాటు చేశారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ సమక్షంలో ఈ ఈవెంట్  జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ ఈ స్టేడియం నాకు రెండో ఇల్లు లాంటిది. నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే దానికి ఈ గ్రౌండే  కారణమని కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ కుంబ్లే స్పందిస్తూ తొమ్మిదేళ్ల వయసులో ఇక్కడ మొదటి సారి మ్యాచ్ చూశాను. నేడు అదే స్టేడియంలో తన పేరును పెవిలియన్ పైన చూడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత క్రికెట్‌ లో వీరిద్దరికి ప్రత్యేక స్థానముంది. రాహుల్ ద్రావిడ్ ఇంటర్నేషనల్ క్రికెట్  కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 24,177 రన్స్ చేశాడు. ఇక  స్పిన్ దిగ్గజం కుంబ్లే మొత్తంగా  956 వికెట్లు పడగొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *