మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తగ్గిన విషయం తెలిసిందే. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హర్ముజ్ జలసంధి’ చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో ఆసియాలోని 50 ఎల్.ఎన్.జీ ట్యాంకర్లు ఖాళీగా నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితి, ఖతార్ లో ఎక్స్పోర్ట్స్ నిలిచిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లు పలు కథనాలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. ప్రపంచంలోనే గ్యాస్ వాణిజ్యానికి ఖతార్ లోని రస్ లఫాన్ కీలకమైనది. ఈ ప్రాంతంలో 20 ఏళ్లులో లిక్విఫైడ్ నేచురల్ ఇండస్ట్రీకి హబ్ గా మారింది. గత నెలలో దీనిపై ఇరాన్ దాడిచేయడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో గ్యాస్ సప్లైకి ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఆసియా నుండి గ్యాస్ నింపి తీసుకురావాల్సిన ట్యాంకర్లు హర్ముజ్ వద్ద ఉద్రిక్తతలతో ఖాళీగా ఉన్నట్లు కొన్ని ఇంగ్లీష్ మీడియా కథనాలు వెల్లడించాయి.