అమెరికా-ఇరాన్ చర్చలు…ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్  జేడీ వాన్స్ టీమ్

Spread the love

అమెరికా-ఇరాన్ ల మధ్య పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చర్చల కోసం అమెరికా వైస్ ప్రెసిడెంట్  జేడీ వాన్స్ టీమ్ తాజాగా ఇస్లామాబాద్ చేరుకుంది. జేడీ వాన్స్ నేతృత్వంలోని ఈ టీమ్ లో వెస్ట్ ఆసియా స్పెషల్ అంబాసిడర్ స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ఉన్నారు. యూఎస్ ఎయిర్ ఫోర్స్ సి-32ఏ ప్లేన్ లో  వీరు ప్రయణించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఫ్లైట్ ఇరాన్ ఎయిర్ స్పేస్ ను  తప్పించుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇస్లామాబాద్ చేరింది. రెండు దేశాల మధ్య నిర్మాణాత్మకంగా చర్చలు జరుపుతాయని, ఇకనైనా ఉద్రిక్తతలు వీడి అక్కడ శాంతి పునరుద్దరించబడుతుందని ఈ సందర్భంగా పాక్ ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికాతో చర్చలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ , పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘర్ నేతృత్వంలోని డెలిగేట్స్ టీమ్ ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకొంది. చర్చలు ప్రారంభం కావడానికి  ముందు రెండు దేశాల ప్రతినిధి బృందాలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో  విడివిడిగా సమావేశం కానున్నట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో ఈ చర్చలు మొదలవనున్నట్లు తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *