తమ్ముడిగా మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను:నారా లోకేష్

Spread the love

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మంత్రి నారా లోకేష్ కి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన లోకేష్ కొత్త బాధ్యతలలో సఫలీకృతులు కావాలని, కూటమి స్పూర్తిని సమర్ధంగా కొనసాగిస్తారని ఆకాంక్షించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యకునిగా మరోసారి ఎన్నికైన పల్లా శ్రీనివాసరావుకి  కూడా పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక పవన్ కు నారా లోకేష్ బదులిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన నన్ను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేసిన ఉప ముఖ్యమంత్రి పవనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులతో, మీ ఆకాంక్ష మేరకు కూటమి స్ఫూర్తి మరింత స్నేహపూర్వకంగా.. సమన్వయంతో, రాష్ట్ర ప్రగతి-ప్రజా సంక్షేమం లక్ష్యంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ్ముడిగా నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సోదరుడిగా మీరు చూపిస్తున్న అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలని లోకేష్ పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *