భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా ఓటు వేయని విషయం తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో, ప్రజాస్వామ్య శక్తులన్నీ మరియు ప్రతిపక్ష నాయకులందరూ ఏకమై ఒక జాతీయ విపత్తును అడ్డుకున్నారని పేర్కొన్నారు. తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా, ఈ నల్ల చట్టాలను ఓడించడానికి ఏకతాటిపై నిలిచిన వివిధ మిత్రపక్షాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా ఎం.కె. స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్ మరియు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులతో పాటు ఇతరులందరికీ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.