భారత్ అభివృద్ధి రెట్టింపు వేగంతో పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో భారత్ తనకు మాత్రమే సాధ్యమైన అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మొట్ట మొదటి ఎలెక్ట్రిఫైడ్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ను ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. అమెరికా, చైనా,కెనడా వంటి దేశాల్లో కూడా డబుల్ స్టాక్స్ ట్రైన్స్ ఎప్పటినుండో నడుస్తున్నప్పటికీ అవి డీజిల్ ఇంజిన్ ట్రైన్స్ అయితే భారత్ మాత్రం పూర్తి ఎలెక్ట్రిక్ వైర్స్ కలిగిన పూర్తి సరకు రవాణా కలిగి ఉన్న దేశంగా భారత్ నిలిచింది. భారతీయ రైల్వేలు నడుపుతున్న భారీ డబుల్-స్టాక్ సరుకు రవాణా రైలు.. కొత్త భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. ఒక్క ప్రయాణంలో 250కి పైగా ట్రక్కులు తరలించే సరుకును ఈ రైలు రవాణా చేయగలదు. విద్యుత్‌తో నడిచే ఈ రైలు వ్యాపార కార్యకలాపాలను వేగవంతం చేయడమే కాకుండా.. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు నిర్మితమవుతున్నాయి. భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఇది మరో కీలక ముందడుగుగా నిలుస్తోంది.
భారతదేశ రవాణా రంగ చరిత్రలోనే కాకుండా, ప్రపంచ రైల్వే రంగానికే ఒక సరికొత్త స్టాండర్డ్ ను సెట్ చేసిందనే చెప్పాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలెక్ట్రిఫైడ్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (DFCC). ఈ కారిడార్ మన భారతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిశను, దశను పూర్తిగా మార్చివేసింది. ఇది కేవలం రైల్వే సాంకేతికత మాత్రమే కాదు. భారతదేశ ఆర్థిక ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పే ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ తో సరుకు రవాణా వేగం మరియు సామర్థ్యం రెట్టింపుగా ఉండడం గమనార్హం. సాధారణ రైల్వే లైన్లలో సరుకు రవాణా రైళ్లు గంటకు సగటున 25 నుండి 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించేవి. అయితే ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పై రైళ్లు గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడిచేలా మౌలిక సదుపాయాలు రూపొందించారు. దీనికి తోడు, భారీ కంటైనర్లను ఒకదానిపై ఒకటి ఉంచి నడిపే “హెవీ డ్యూటీ డబుల్ స్టాక్ కంటైనర్ ట్రైన్లను” నడపగలిగే అత్యంత ప్రతిష్టాత్మక ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా తక్కువ సమయంలో, భారీ మొత్తంలో సరుకులను దేశంలోని ఒక మూల నుండి మరొక మూలకు చేరవేయడం సులభతరమవుతుంది.
ఇక గ్రీన్ ఎనర్జీ దిశగా భారత్ ప్రయాణాన్ని ఈ ఎలెక్ట్రిఫైడ్ కారిడార్ మరింత పటిష్టం చేయనుంది. డీజిల్ ఇంజన్ల స్థానంలో 100% విద్యుత్ తో నడిచే ఇంజన్లను వాడటం వల్ల బొగ్గు లేదా డీజిల్ వినియోగం తగ్గుతుంది. తద్వారా కార్బన్ ఉద్గారాలు (Carbon Emissions) భారీగా తగ్గుతున్నాయి. వేల సంఖ్యలో లారీలు, ట్రక్కులు రోడ్డు రవాణా ద్వారా చేసే కాలుష్యాన్ని ఈ ఒకే ఒక్క కారిడార్ తగ్గిస్తుంది. అలాగే ఈ కారిడార్ భారతదేశంలో “లాజిస్టిక్స్ వ్యయాన్ని” తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. వేగవంతమైన కనెక్టివిటీ అందించడం ద్వారా ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. పోర్టులు (ఓడరేవులు), ఇండస్ట్రియల్ ఏరియాలు, మరియు పెద్ద పెద్ద నగరాలను నేరుగా అనుసంధానించడం వల్ల దేశీయ వ్యాపార రంగానికి, తయారీ రంగానికి మరింత దన్నుగా నిలవనుంది. వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, మరియు ఇతర త్వరగా పాడైపోయే వస్తువులను వేగంగా మార్కెట్లకు చేర్చడానికి ఇది తోడ్పడుతోంది. లక్షలాది మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దీని ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ స్థాయి భారీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం అనేది భారత సాంకేతిక, ఆర్థిక మరియు ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిదర్శనం. రాబోయే దశాబ్దాలలో భారత ప్రగతి రథాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.