కే.ఎల్.రాహుల్ భారీ సెంచరీ..ఐపీఎల్ ఇదే మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్

Spread the love

ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా  ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నేడు జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. కే.ఎల్.రాహుల్ 152 నాటౌట్ (67; 16×4, 9×6) భారీ సెంచరీతో రాణించాడు. విధ్వంసక ఆటతీరుతో పంజాబ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే ఓపెనర్ పతుమ్ నిస్సంక (11) వికెట్‌ను 28 పరుగుల వద్ద కోల్పోయినప్పటికీ నితీశ్ రాణాతో కలిసి కేఎల్ రాహుల్ అసలు సిసలైన విధ్వంసం ప్రారంభించాడు. నితీష్ రాణా 91 (44; 11×4, 4×6) కూడా భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్‌ కు ఏకంగా 95 బంతుల్లో 220 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.  వీరిద్దరూ రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ లో వ్యక్తిగత స్కోర్ లో క్రిస్ గేల్ (175), మెక్ కల్లమ్ (158) తరువాత నేడు కే.ఎల్.రాహుల్ చేసిన స్కోరే అత్యధిక స్కోర్. వీరు ముగ్గురు మాత్రమే ఐపీఎల్ లో 150కి పైగా పరుగులు చేయగలిగారు. 

ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. బార్ట్ లెట్ 4 ఓవర్లలో ఏకంగా 69 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మార్కో జాన్సెన్ 4 ఓవర్లలో 45 పరుగులు, విజయ్ కుమార్ వైషాక్ 3 ఓవర్లలో 48 పరుగులు, యుజువేంద్ర చాహల్ 4 ఓవర్లలో 42 పరుగులు మార్కస్ స్టోయినీస్ 1 ఓవర్ వేసి 11 పరుగులు ఇచ్చాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *