సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు 

Spread the love

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం  ప్రసిద్ధి చెందిన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం తర్వాత, దేవస్థానం పండితులు సీఎం  చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పర్యటనలో సీఎంతో  పాటు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, గణబాబు తదితరులు కూడా స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఈరోజు విశాఖలో సీఎం చంద్రబాబు గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *