ఈరోజు పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా, భాగస్వామ్యయుతంగా మార్చేందుకు నేడు ఓటు వేస్తున్న వారందరూ రికార్డు స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్‌లోని మహిళా మరియు యువశక్తి పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ నెల 23న మొదటి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిల ఎన్నికలు ఇప్పటికే పూర్తి కాగా, మొత్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నేడు జరుగుతున్న పోలింగ్ తో పూర్తవనున్నాయి. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.