ఆయన ప్రత్యేక శ్రద్ధ వల్లే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఈ గుణాత్మక మార్పు:హోం మంత్రి అనిత 

Spread the love

నేడు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో 78.39% ఉత్తీర్ణత నమోదు కావడం మంత్రి లోకేష్  దార్శనికతకు, పక్కా ప్రణాళికకు నిదర్శనమని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు. విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ కృషి ఫలించడం సంతోషం కలిగించింది.  పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం వారు ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాన్నివ్వడమే కాకుండా ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు.   పదో తరగతి ఫలితాల్లోపోయిన సంవత్సరం కంటే  ఉత్తీర్ణత శాతం 81.14% నుండి 85.25%కి పెరగడం, ముఖ్యంగా బాలికలు 87.90% ఉత్తీర్ణతతో పైచేయి సాధించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం విజయనగరం జిల్లా మూడో స్థానం, అనకాపల్లి జిల్లా ఆరో స్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం లోకేష్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఈ స్థాయి మార్పు సాధ్యమైందని స్పష్టం చేశారు. అద్భుత విజయం సాధించిన విద్యార్థులకు, ఆ దిశగా వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు  అభినందనలు మంత్రి అభినందనలు తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు బాధపడకుండా మరోసారి ప్రయత్నించి విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *