నష్టాలతో తగ్గిన దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు

Spread the love

నేటి ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్582 పాయింట్లు నష్టంతో 76,913 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయి  24,177 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.94.78గా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావం అలాగే  రూపాయి విలువ క్షీణత మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా సూచీల జోరును తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్‌ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల వద్ద కదలాడడం గమనార్హం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను అలాగే  ఉంచినప్పటికీ, ద్రవ్యోల్బణంపై వారి వైఖరి మదుపర్లను అప్రమత్తంగా వ్యవహరించేలా చేసింది. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించి లాభాల స్వీకరణకు ఆసక్తి కనబరిచారు. నేటిట్రేడింగ్ లో బజాజ్ ఆటో, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ తదితర షేర్లు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *