‘పెద్ది’లో అలరించనున్నగౌర్ నాయుడు పాత్ర 

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చాల నెలలుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా జూన్  4న విడుదల కానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ‘పెద్ది’ గురించి భారీ చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ కెరీర్‌ లో ఇది మరో ప్రత్యేకమైన సినిమాగా నిలవబోతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ లో తెరకెక్కుతున్న ఒక పల్లెటూరి డ్రామా. గ్రామీణ వాతావరణం, భావోద్వేగాలు, క్రీడల నేపథ్యం అన్ని కలిసి ఈ కథను ఎంతో ఆసక్తికరంగా మార్చబోతున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారని చెబుతున్నారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని కూడా ఇప్పటివరకు చూసిన చరణ్‌కు భిన్నంగా ఉండబోతున్నాయని సమాచారం. ఈ సినిమాలో మరో ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తున్నది కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పాత్ర. ఆయన ఈ సినిమాలో ‘గౌర్ నాయుడు’ అనే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కథలో చాలా డెప్త్ కలిగి ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రీ క్లైమాక్స్‌కు ముందు రామ్ చరణ్ శివరాజ్ కుమార్ కలిసి వచ్చే ఒక ఎపిసోడ్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. గౌర్ నాయుడు పాత్ర సరిగ్గా కనెక్ట్ అయితే, ‘పెద్ది’ సినిమాకు కర్ణాటకలో కూడా భారీ స్థాయిలో ఆదరణ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే రామ్ చరణ్‌కు అక్కడ మంచి మార్కెట్ ఉంది. కానీ శివరాజ్ కుమార్ వంటి స్టార్ నటుడు ఈ సినిమాలో ఉండటంతో, అక్కడి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా కన్నడ ప్రేక్షకులు తమ స్టార్‌ను చూసేందుకు థియేటర్లకు రావడం ఖాయం. ఇలాంటి పరిస్థితి గతంలో కూడా చూసాం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలో శివరాజ్ కుమార్ చిన్న పాత్రలో కనిపించినప్పటికీ, ఆయన కోసం బెంగళూరు వంటి నగరాల్లో అభిమానులు మళ్లీ మళ్లీ సినిమాను చూసిన ఉదాహరణ ఉంది. అదే విధంగా ‘పెద్ది’లో ఆయన పాత్ర బలంగా ఉంటే, ఈ సినిమాకు అదనపు మైలేజ్ దక్కడం ఖాయం. మెగాస్టార్ కుటుంబం, రాజ్ కుమార్ కుటుంబం మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఈ రెండు కుటుంబాల నుంచి వచ్చిన నటులు కలిసి పూర్తి స్థాయి సినిమాలో నటించే అవకాశం రాలేదు. ‘గౌర్ నాయుడు’ పాత్ర ద్వారా ప్రేక్షకులు ఒక కొత్త శివరాజ్ కుమార్‌ను చూడబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.రామ్ చరణ్ శివరాజ్ కుమార్ కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటే, అది అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారుతుంది.మొత్తానికి ‘పెద్ది’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ, అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ట్రైలర్ విడుదల కోసం ఎదురుచూస్తున్న వారు, సినిమా కథ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *