పెద్ది సెట్స్ లో మెగాస్టార్, సుకుమార్

Spread the love

రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’ తాజాగా విడుదలైన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సినిమాలోని అత్యంత కీలకమైన ‘పెద్ది పెహిల్వాన్’ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ సుకుమార్ సెట్స్‌ కు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ ఎంట్రీ ఇవ్వగానే సెట్స్ మొత్తం సందడిగా మారిపోయింది. పెహిల్వాన్ గెటప్స్‌లో ఉన్న ఆర్టిస్టులు చిరంజీవికి ఘన స్వాగతం పలికారు. తర్వాత చిరంజీవి, సుకుమార్‌ను ఆత్మీయంగా కౌగిలించుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. అనంతరం రామ్ చరణ్, బుచ్చిబాబు, సుకుమార్ కలిసి షూట్ చేసిన సన్నివేశాలను మానిటర్‌లో చూస్తూ కనిపించారు. ఈ సందర్భంగా చిరంజీవి సరదాగా “నా కోసం చరణ్‌ తో సైకిల్ తొక్కించే ఒక్క షాట్ అయినా సినిమాలో పెట్టు” అని బుచ్చిబాబును అడగడం అక్కడ నవ్వులు పూయించింది.అలాగే చరణ్, సుకుమార్, బుచ్చిబాబులు కలిసి బైసెప్స్ చూపిస్తూ ఫోజులివ్వగా… చిరంజీవి స్వయంగా ఫోటోలు తీశారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీమేకర్స్ పతాకాలపై తెరకెక్కుతోంది. కిలారు వెంకట సతీష్ నిర్మిస్తున్నారు.  ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్‌తో కలిసి ఆమె చేసే డాన్స్ నంబర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తాజాగా ఓవర్సీస్ టికెట్ల బుకింగ్ లో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. భారీ ఎమోషన్స్, గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ డ్రామా, మాస్ యాక్షన్ కలిసిన ఒక పాన్ ఇండియా సినిమాగా అలరించనుంది. జూన్ 4 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *