రష్యా టు ఇండియా రైల్వే లైన్ రూట్..సక్సెస్ అయితే గేమ్ ఛేంజరే..!  

Spread the love

ప్రపంచ రవాణాలో జలమార్గాల పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. దేశాల మధ్య జరిగే వ్యాపారంలో 80 శాతానికి పైగా సముద్ర మార్గాల   ద్వారానే జరుగుతుంది. ఒఅయితే ఇటీవల ఆ సముద్ర మార్గాలకు భారీ ముప్పు ఏర్పడింది. మధ్యప్రాచ్యంలో  జరుగుతున్న యుద్ధాలు హార్ముజ్ జలసంధి వంటి వ్యూహాత్మక మార్గాల్లో ప్రయాణించడం షిప్పింగ్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారింది. ఇటువంటి శాశ్వత పరిష్కారం చూపేలా కొన్ని దేశాల  ఆధిపత్యానికి చెక్ పెట్టేలా.. ఇప్పుడు రష్యా  ఒక వ్యూహాత్మక ఎత్తుగడను  తెరపైకి తెచ్చింది. సముద్రాలతో పనిలేకుండా, నేరుగా నేల మీద నుంచే రష్యా నుండి  భారతదేశానికి ఒక భారీ   రైల్వే కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదనను రష్యా తాజాగా ప్రకటించింది. రష్యా ఉప ప్రధాని మారత్ ఖుస్నుల్లిన్ ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయం చెప్పారు. సముద్ర మార్గాలకు ప్రత్యామ్నాయంగా.. భూభాగం మీదుగా  కొత్త మార్గాలను అన్వేషించాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా ఇండియాకు, హిందూ మహాసముద్రానికి కనెక్ట్ అయ్యేలా ఒక డైరెక్ట్ రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేయాలి  అని ఆయన రష్యా ప్రతిపాదనను బయటపెట్టారు.ఒకవేళ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే.. దాని రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. రష్యా నుంచి మొదలయ్యే ఈ భారీ రైల్వే నెట్‌వర్క్.. మధ్య ఆసియా దేశమైన తుర్క్‌మెనిస్తాన్ మీదుగా, అక్కడినుంచి ఇరాన్ లోకి ప్రవేశిస్తుంది. ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్,   పాకిస్తాన్ దేశాలను దాటుకుని ఫైనల్ గా భారతదేశ సరిహద్దులకు చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ ద్వారా రష్యాకు దక్షిణాసియాతో  పాటు, ఇండియా ద్వారా నేరుగా హిందూ మహాసముద్రానికి కూడా కనెక్టివిటీ దొరుకుతుంది.ఇప్పటికే రష్యా , ఇండియా మధ్య వేల కోట్ల డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నడుస్తోంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. సముద్రంలో ఎదురయ్యే దోపిడీలు,  మిలిటరీ అడ్డంకులు , షిప్పింగ్ డిలేస్ లాంటి సమస్యలన్నీ తీరిపోతాయి. నౌకల కంటే చాలా వేగంగా, సేఫ్ గా ఇరు దేశాల మధ్య సరుకు రవాణా జరిగే అవకాశం ఉంటుంది.వినడానికి ఈ ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ.. ప్రాక్టికల్ గా దీన్ని అమలు చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే.  ఈ మార్గం నాలుగు, ఐదు దేశాల మీదుగా సాగాల్సి ఉంటుంది. మొదటి సవాలు భౌగోళిక పరిస్థితులు . ఆఫ్ఘనిస్తాన్ లాంటి క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో రైల్వే ట్రాకులు వేయడం అంత తేలిక కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కానీ ఇది గనక విజయవంతమైతే రష్యా-భారత్ వాణిజ్యానికి ఇది ఒక గేమ్ ఛేంజర్  అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదనే టాక్ వినిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *