భారత్ గత కొన్నేళ్లల్లో చాలా మారింది. మనకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న పాకిస్తాన్ మనముందు నిలబడే స్థాయి లేదు. భారత్ మాత్రం అంతకంతకూ పెరుగుతూ శత్రు దుర్బేధ్యంగా తయారైంది. ఇక దేశ భద్రతకు సంబంధించి మన ఆర్మీ ఫోకస్, స్ట్రాటజీ మొత్తం మారిపోయిందని.. మన అసలైన టార్గెట్ పాకిస్తాన్ కాదు, చైనానే అని ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్, రిటైర్డ్ జనరల్ ఎం.ఎం. నరవణే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాబోయే సంవత్సరాల్లో భారతదేశానికి చైనానే ప్రధాన పోటీదారు అని అన్నారు. వాస్తవానికి 2020లో గాల్వాన్ లోయలో చైనాతో భయంకరమైన ఘర్షణలు జరిగినప్పుడు, ఇండియన్ ఆర్మీకి నేతృత్వం వహించింది ఈయనే. ఇక ఈ విషయం మీద లోతుగా విశ్లేషిస్తే భారత్ ఇటు పాకిస్తాన్‌తో, అటు చైనాతో రెండు దేశాలతోనూ గతంలో యుద్ధాలు చేసింది. రెండింటితోనూ మనకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. కానీ ఈ రెండు దేశాల ముప్పు అనేది పూర్తిగా డిఫరెంట్ అని నరవణే స్పష్టం చేశారు. పాకిస్తాన్ అనేది నిరంతరం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుండటం వల్లే మన దృష్టి అటువైపు మళ్లింది. కానీ, లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే, రాబోయే సంవత్సరాల్లో మనకు అసలైన సవాల్ విసిరేది మాత్రం చైనానే అని ఆయన తేల్చి చెప్పారు. పాకిస్తాన్ అనేది కేవలం బోర్డర్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే దేశమైతే, చైనా అనేది గ్లోబల్ స్థాయిలో మనల్ని ఢీకొట్టే ఒక మహా శక్తి అని పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా ఇండియన్ ఆర్మీ ప్లానింగ్‌ను బట్టబయలు చేశారు.
ఇక్కడే జనరల్ నరవణే ఒక ఇంట్రెస్టింగ్ పదం వాడారు. సాధారణంగా బోర్డర్లో ఉన్న దేశాన్ని, అందులోనూ మన స్థలాలను ఆక్రమించాలని చూసే దేశాన్ని మనం శత్రువు అంటాం. కానీ నరవణే మాత్రం ఉద్దేశపూర్వకంగా చైనాను శత్రువు అనకుండా కాంపిటీటర్ అని పిలిచారు. చైనా మనకు రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, మిలిటరీ.. ఇలా అన్ని రంగాల్లోనూ ఒక ప్రధాన పోటీదారుగా మారబోతోంది, అని నరవణే విశ్లేషించారు. ఇరు దేశాల మధ్య లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం నడుస్తోంది. అంతర్జాతీయ వేదికలపై రెండు దేశాలు గ్లోబల్ లీడర్ షిప్ కోసం పోటీ పడుతున్నాయి. ఎప్పుడైతే ఇలాంటి ఆధిపత్య పోరు ఉంటుందో, అక్కడ కచ్చితంగా చిన్నచిన్న ఘర్షణలు వస్తూనే ఉంటాయని ఆయన ఒక ప్రాక్టికల్ వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేశారు. చైనాను కేవలం తుపాకులతోనే కాదు, వ్యాపారం, టెక్నాలజీ, డిప్లొమాసీతోనూ డీల్ చేయాలన్నది ఈ మాస్టర్ స్కెచ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది.
మరి ఈ ఘర్షణలు యుద్ధం వైపు తీసుకెల్తాయా అనే సందేహం రావొచ్చు. అయితే సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఒక ఆర్మీ చీఫ్‌కు ఉండాల్సిన అసలైన పరిపక్వత ఆయన చూపించారు. యుద్ధం అనేది దేశాలను దశాబ్దాల వెనక్కి నెట్టేస్తుంది. ఏ దేశంతోనైనా ఘర్షణ తలెత్తినప్పుడు దానిని దౌత్యపరమైన చర్చలు, డైలాగ్స్ ద్వారానే పరిష్కరించుకోవాలని జనరల్ నరవణే ఉద్ఘాటించారు. బలప్రయోగం అనేది ఎల్లప్పుడూ మన చివరి ఆప్షన్ గానే ఉండాలన్నారు. అయితే, అవతలి దేశం వినని పరిస్థితి వచ్చినప్పుడు, ఆఖరి అస్త్రంగా వాడుకోవడానికి మన మిలిటరీ చేతిలో అత్యంత బలమైన నిరోధక శక్తి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మన దగ్గర పవర్ ఫుల్ ఆయుధాలు, రెడీగా ఉన్న సైన్యం ఉంటే.. శత్రువు మన మీద దాడి చేయడానికి వందసార్లు ఆలోచిస్తాడు. అదే అసలైన నిరోధక శక్తి. అందుకే భారత సాయుధ దళాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా, ఏ క్షణంలోనైనా యుద్ధానికి రెడీగా ఉండాలని పేర్కొన్నారు. ఒకవైపు పాకిస్తాన్ ఉగ్రవాదంతో విసిగిస్తూనే ఉంటుంది.. దాన్ని అణిచివేస్తూనే, మరోవైపు మనకంటే ఆర్థికంగా, సైనికంగా బలంగా ఉన్న చైనాను ఢీకొట్టడానికి ఇండియా ఒక పక్కా మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వెళుతోంది. దే