రాజస్థాన్‌లో సీజేపీకి చేదు అనుభవం: గ్రామస్తుల ఆగ్రహం ఎందుకు?

Spread the love

గవర్నమెంట్ స్కూల్స్ లో పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ టీమ్ కు అక్కడి స్థానికుల నుండి ఊహించని స్పందన వ్యక్తమైంది. వారి రాకపై కొందరు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా సీజేపీ కో-కన్వీర్ అశుతోష్ రంకా సహా పలువురు నేడు రాజస్థాన్ లో  పర్యటించారు. ఈ సందర్భంగా జైపుర్ జిల్లాలోని రాంపురా కన్వర్పురా గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఊరి శివారులోనే స్థానికులు వీరిని అడ్డుకున్నారు. తమ స్కూళ్లను తామే బాగు చేసుకుంటామంటూ గ్రామస్థులు సీజేపీ టీమ్ ను  బలవంతంగా అక్కడి నుంచి తరిమికొట్టారు.  దీనిపై సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే రాజస్థాన్ లోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 

కాక్రోచ్ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో అభిజిత్ దీప్కే చేత స్థాపించబడింది. ఇది ఆన్‌లైన్‌లో త్వరగా ప్రజాదరణ పొంది, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యువతను ఆకట్టుకుంది. నిరుద్యోగం, పరీక్షల అవకతవకలు, పాలనా వ్యవహారాలపై పలు నిరసనలు చేపట్టింది. గత నెలల్లో, వారు సుమారు పదికి పైగా రాష్ట్రాల్లో వివిధ సమస్యలపై క్యాంపెయిన్‌లను నిర్వహించారు, వాటిలో కొన్ని విజయవంతమయ్యాయి. ఈ పార్టీకి అశుతోష్ రంకా సహ-కన్వీనర్ మరియు అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారి ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా రూపొందించబడింది. ఇది దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లను వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా రాజస్థాన్ లో ఎదురైన ఈ ఘటన ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. స్థానికులు తిరగబడి కొందరిని చితక్కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *