ఈ ఏడాది ‘పెద్ది’ సినిమాతో భారీ హిట్ ను అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన 17వ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తో చేయనున్నారు. ‘రంగస్థలం’ వంటి పాత్ బ్రేకింగ్ సినిమా తరువాత కాంబినేషన్ నుండి వస్తున్న రెండో సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని సమాచారం. డిసెంబరు నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈలోగా నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఖరారు చేయనున్నారు. ఇక మరోవైపు ఈ సినిమా కోసం చరణ్ నాజూకైన కొత్త లుక్ కనిపించనున్నారని తెలుస్తోంది. మరి ఈసారి చరణ్ ను సుకుమార్ ఇంకెంత పవర్ ఫుల్ పాత్రలో చూపించనున్నారో అనే అంచనాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి.
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు గురించిన ప్రతి అప్డేట్ పై ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కలయికలో ఇప్పటికే వచ్చిన ‘రంగస్థలం’ సినిమా ఏ రేంజ్లో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుకుమార్ వివిధ కథాంశాలపై చర్చించి, చివరికి ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను లాక్ చేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ లుక్ పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. గత చిత్రాలతో పోలిస్తే సరికొత్త స్టైలిష్ మరియు అర్బన్ లుక్‌లో ఆయన కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ తన బరువును కూడా తగ్గనున్నట్లు సినీ వర్గాల ఉంది వస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇటీవల మణికట్టుకు చిన్న శస్త్రచికిత్స జరగడంతో, కోలుకున్న వెంటనే ఆయన ఈ శారీరక మార్పుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి చరణ్ సరసన ఎవరు నటించనున్నారో. ఇక పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. పుష్ప సినిమాలతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్ ఈ సినిమాను కూడా అంతకు మించి తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.