ఈ ఫాహ్.. అనే ఫేమస్ మీమ్ వాయిస్ ఆ దివంగత స్టార్ కమెడియన్ దే..! 

Spread the love

ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తున్న  ఒక ఫన్నీ సౌండ్ ‘ఫాహ్’. అందరికీ ఈ పాటికే మైండ్ లోకి వచ్చేసి ఉంటుంది అయితే ఈ వైరల్ సౌండ్ మన తెలుగు సినిమా నుంచే పుట్టింది. రీసెంట్ గా ఒక సోషల్ మీడియా యూజర్  ఈ వైరల్ సౌండ్ కు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేయడంతో అసలు నిజం ప్రపంచానికి తెలిసింది. ఆ వీడియో చూసి టాలీవుడ్ ప్రేక్షకులు, తెలుగు మీమర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.కారణం ఏంటంటే, ఆ ఫాహ్ సౌండ్ చేసింది మరెవరో కాదు.. మనల్ని కడుపుబ్బా నవ్వించిన కామెడీ కింగ్, స్వర్గీయ వేణుమాధవ్ .  అవును, ఒక పాత తెలుగు సినిమాలో వేణుమాధవ్  చేసిన ఒక కామెడీ సీన్ లోని డైలాగ్ ను కట్ చేసి, ఎవరో ఇలా మీమ్ టెంప్లేట్ గా వదిలారు. షేర్ చేసిన  ఒరిజినల్ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చాలా  మంది చర్చించుకుంటున్న విషయం ఇన్ని రోజులు ఈ సౌండ్ వాడాము కానీ, ఇది మన వేణుమాధవ్ వాయిస్ అని గుర్తుపట్టలేకపోయామే  అని తెలుగు నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్స్ పెడుతున్నారు. వేణుమాధవ్  స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు. ఇప్పుడు ఆయన టోన్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక వైరల్ ట్రెండ్ గా మారిపోయింది. మన దేశంలో  ఏ భాషలోనైనా ఒక మీమ్ ట్రెండ్ అవుతోంది అంటే, దాని వెనుక కచ్చితంగా మన తెలుగు సినిమా సీన్, లేదా మన టాలీవుడ్ కమెడియన్ ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం వేణుమాధవ్  భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పండించిన నవ్వులు మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఒక నటుడికి ఇంతకంటే గొప్ప నివాళి  ఇంకేముంటుంది చెప్పండి  ఆయన ఒకప్పుడు చేసిన ఒక చిన్న యాక్టింగ్, ఆ ఎక్స్ ప్రెషన్.. ఇప్పుడు 2026 నాటి స్మార్ట్ ఫోన్ జనరేషన్ ను కూడా కడుపుబ్బా నవ్విస్తోంది. రోజూ మనకి తెలియకుండానే ఆయన కామెడీని మన వాట్సాప్ స్టాటస్ లలో, ఫ్రెండ్స్ తో పంచుకునే మీమ్స్ లో వాడుకుంటూనే ఉంటాం. నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఒక అద్భుతమైన కమెడియన్ ను మిస్ అయ్యింది. ఒకవేళ ఆయన ఇప్పుడు గనుక బతికి ఉంటే, సోషల్ మీడియాలో వస్తున్న తన మీమ్స్ ని చూసి కచ్చితంగా ఎంతో ఎంజాయ్ చేసేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *