భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ మూవీ ప్రమోషన్స్ జోరు మొదలైంది. తాజాగా ఈ సినిమా నుండి ‘జయ జయ రామ్’ అనే భక్తి గీతాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది. శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రానికి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మాత. ఈ సినిమా దీపావళికి థియేటర్లలోకి రానుంది. ‘రామ్ సియా రామ్.. సియా రామ్.. జయ జయ రామ్’ అంటూ సాగుతున్న ఈ గీతం ఆకట్టుకుంది. ఈ గీతానికి కుమార్ విశ్వాస్ సాహిత్యం అందించగా అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కనిపించనున్నారు.భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే ఈ రామాయణ మహా కావ్యం కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, అది మానవ జీవితానికి అవసరమైన ధర్మం, నీతి మరియు ఆదర్శాలను చాటి చెబుతుంది. తరాలు మారినా, నాగరికతలు మారినా రామాయణం బోధించిన ఆదర్శాలు ఎప్పటికీ చిరస్మరణీయం. రామాయణం ఆధారంగా సినిమా వస్తుండడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో పుస్తకాలు చదివే అలవాటు తగ్గుతున్న వేళ, రామాయణాన్ని సినిమా రూపంలోకి తీసుకురావడం వల్ల నేటి యువతరం మరియు పిల్లలకు మన ప్రాచీన సంస్కృతి మరింత చేరువవుతుందని చర్చ జరుగుతోంది. విరామాయణాన్ని సినిమాగా తీయడం ద్వారా భారతదేశపు గొప్ప ఇతిహాసాన్ని తర్వాతి తరాలకు చేరువ చేసే ప్రయత్నంగా కొనియాడుతున్నారు. ‘హాలీవుడ్’ సూపర్‌హీరో సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, భారతీయ మూలాలున్న ఈ గొప్ప కథను విశ్వవ్యాప్తం అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు రామాయణం పై సినిమాలు వచ్చి విజయాలను అందుకున్నాయి. రామాయణాన్ని దృశ్యరూపంగా మలచడం అనేది సినీ పరిశ్రమకు ఒక సవాలుతో కూడుకున్న గొప్ప అవకాశం. ప్రపంచస్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఇటువంటి గొప్ప సినిమాలు వచ్చినప్పుడల్లా ప్రజలు ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూసే వాతావరణం ఏర్పడుతుంది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.