పాకిస్థాన్ అసత్య ప్రచారంలో ముందుంటుంది. తాజాగా మరోసారి ఈ తరహా ప్రయత్నానికి పాల్పడి అభాసుపాలైంది. వివరాల్లోకి వెళితే భారత్ కు సంబంధించి ఒక ఫైటర్ జెట్ కూలిపోయిందని తప్పుడు ప్రచారానికి పాక్ కు అనుకూల సోషల్ మీడియా అకౌంట్స్ లలో తెరలేపింది. అయితే భారత్ ప్రూఫ్ లతో సహా ఆ ప్రేలాపనలు అవాస్తవమని తిప్పికోట్టింది. భారత ప్రభుత్వానికి చెందిన PIB factcheck ఈ ప్రచారం అవాస్తవమని ఖండించింది. ఈ మేరకు ఒక వివరణాత్మక పోస్ట్ ను చేసింది. పాకిస్థాన్‌కు అనుకూలంగా ప్రచారం చేసే కొన్ని ప్రొపగాండా ఖాతాలు.. భారత వైమానిక దళానికి (IAF) చెందిన మిగ్-29 యుద్ధవిమానం ల్యాండింగ్ సమయంలో పైలట్ తప్పిదం కారణంగా కూలిపోయిందంటూ ఓ వీడియోను ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఆ ప్రచారంలో ఉపయోగించిన వీడియో ‘War Thunder’ అనే వీడియో గేమ్‌కు సంబంధించినదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద లేదా తప్పుడు సమాచారాన్ని మీరు గమనించినట్లయితే, దాన్ని “PIB Fact Check” కు రిపోర్ట్ చేయాలని నెటిజన్లకు సూచించింది. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో కూడా ఇలాగే తప్పుడు ప్రచారాలకు పాల్పడి దారుణంగా ట్రోల్ అయిన సంగతి తెలిసిందే.
భారతదేశంపై నిత్యం విషం చిమ్మేందుకు సరిహద్దు అవతలి నుండి కుట్రలు జరుగుతూనే ఉంటాయి. సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా పాకిస్థాన్ అనుకూల ప్రొపగాండా అకౌంట్ లు పనిచేస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ తరహా నీచమైన ప్రయత్నానికి తెరలేపి పూర్తిగా అభాసుపాలయ్యాయి. పాక్ అనుకూల మూలాలు ఉద్దేశపూర్వకంగా ఆ రంగును మార్చి దుష్ప్రచారానికి తెగబడ్డాయి.ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా భారత్ పై తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. శ్రీనగర్ ఎయిర్‌బేస్‌పై దాడులు జరిగాయని, భారత భూభాగంపై క్షిపణి దాడి జరిగిందంటూ అప్పట్లో కొన్ని పాకిస్థానీ మీడియా సంస్థలు, సోషల్ మీడియా అఫిషియల్స్ నిరాధారమైన వార్తలను ప్రచారం చేసినా భారత అధికారిక ఫాక్ట్ చెక్ సంస్థలు, మన నెటిజన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఆ ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాయి. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, పాకిస్థాన్ నిరంతరం ఫేక్ సోషల్ మీడియా బాట్ నెట్వర్క్ లను వాడుతూ భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రవహింపజేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి వార్తను ఆధారాల్లేకుండా నమ్మవద్దని పీఐబీ ఫాక్ట్ చెక్ విభాగం ప్రజలకు స్పష్టం చేస్తోంది. అధికారిక యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటోంది. సోషల్ మీడియాలో ఎక్కడైనా అనుమానాస్పద లేదా తప్పుడు సమాచారం కనిపిస్తే, వెంటనే దానిని సంబంధిత ఫాక్ట్ చెకింగ్ విభాగాలకు రిపోర్ట్ చేయాలని అధికారులు చెబుతున్నారు. నెటిజన్లు కూడా ఏ చిన్న వార్తను షేర్ చేసే ముందైనా దాని నిజానిజాలను సరిచూసుకోవడం ముఖ్యం. భారతీయ చట్టాల ప్రకారం తప్పుడు వార్తలను సృష్టించి జాతి భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తగిన నిబంధనలు అమలులో ఉన్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి దుష్ప్రచారాలను అణచివేయడానికి ప్రభుత్వం మరింత పటిష్ట చర్యలు చేపడుతోంది.పౌరులు కూడా సహకరించి ఈ అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.