అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘ది ప్యారడైజ్’ సునామీ!

Spread the love

ప్రస్తుతం సినీ ప్రేక్షకులందరి చూపు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాపైనే ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకముందు విడుదలైన ‘దసరా’ హిట్ ను అందుకుంది. ఇప్పుడు దసరా కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే నైజాం ఏరియాలో సరికొత్త రికార్డులు  సృష్టిస్తున్నాయి. నిన్న సాయంత్రం బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే నైజాం వ్యాప్తంగా ఏకంగా లక్షకు పైగా టికెట్లు అమ్ముడై ఏ స్థాయి క్రేజ్ ఉందో చూపాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నైజాం హక్కులను టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ రేటుకు దక్కించుకున్నారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ, బుక్ మై షోలో హైదరాబాద్ లొకేషన్ పరిధిలోనే కేవలం కొన్ని గంటల్లో 1 కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూలైంది. దీన్ని బట్టి చూస్తే బాక్సాఫీస్ వద్ద నాని హవా ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం నుండి స్పెషల్ షోలు,  టికెట్ హైక్ జీవో కూడా రావడంతో మేకర్స్ ఖుషీగా ఉన్నారు.  నైజాం చరిత్రలోనే ఒక తెలుగు సినిమాకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో షోలను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే సినిమా గ్రాండ్ రిలీజ్ కంటే ముందే, అంటే  సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకే నైజాం వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీమియర్ షోలను ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఆడియన్స్ కు ఈసినిమా  నెటివిటీ చాలా ఈజీగా కనెక్ట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  ఇందులో నాని జడల్ అనే ఒక సరికొత్త ఊరమాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఆ జడల్ క్యారెక్టర్ లోని వైల్డ్ నెస్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని అలాగే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా అదిరిపోతుందనే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు  ఈ సినిమాలో షికంజా మాలిక్   పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు హైలైట్ గా నిలవబోతోంది. వీళ్లతో పాటు బాలీవుడ్ నుంచి రాఘవ్ జుయాల్, సీనియర్ నటి సోనాలి కులకర్ణి, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ ఈ సినిమాలో ఒక సూపర్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఏష నాగుల అనే ఒక మాస్ ఐటం సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *