మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమా ‘స్లమ్ డాగ్ టెంపుల్ రోడ్ 33’. తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ఒక అప్డేట్ షేర్ చేసుకున్నారు. సీనియర్ నటి జరీనా వహాబ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ ఒక వీడియో వదిలారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. టబు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక పూరిజగన్నాథ్ ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
పూరి జగన్నాథ్ – టాలీవుడ్లో ఈ పేరు ఒక బ్రాండ్. తనదైన వేగం, పదునైన డైలాగ్స్, మాస్ ఎలిమెంట్స్ తో తెలుగు సినిమాను ఒక కొత్త మలుపు తిప్పిన డైరెక్టర్ తన సినిమల్లోని హీరోలకు ఒక ఆటిట్యూడ్ తో సిల్వర్ స్క్రీన్ పై పవర్ ఫుల్ యాంగిల్ ను తీసుకొచ్చి తనదైన మార్క్‌తో సుదీర్ఘకాలం టాలీవుడ్లో అగ్రపథాన కొనసాగారు. పూరి సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పొగరు, రఫ్‌నెస్, తో క్యారెక్టర్లను కూడా ప్రేక్షకులు గుండెల్లో హత్తుకునేలా తీర్చిదిద్దడం ఆయన స్పెషాలిటీ. ‘బద్రి’, ‘ఇడియట్’,శివమణి, ‘పోకిరి’, ‘దేశముదురు’, ‘టెంపర్’ ఇలా ఈ సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ మాములు రేంజ్ లో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయలేదు. పూరి జగన్నాథ్ రైటింగ్ నుండి పేలే ప్రతి సంభాషణ ఒక పవర్ ఫుల్ బుల్లెట్ లాంటిది. డైలాగ్ వినగానే ఏ స్టార్ హీరో అయినా పూరి మార్క్ వైబ్‌లోకి మారిపోవాల్సిందే. అలాగే సినిమా చిత్రీకరణ విషయంలో పూరి జగన్నాథ్ వేగం టాలీవుడ్లో ఒక బెంచ్‌మార్క్. అనుకున్న కథను చాలా తక్కువ రోజుల్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లి, అంతే వేగంగా షూటింగ్ పూర్తి చేయడం ఆయన స్పెషలిటీ. ఆయన సమకాలీన డైరెక్టర్లలో కూడా ఆయనకు అభిమానులున్నారు. కథనాన్ని పరుగెత్తించడం, ఫాస్ట్ ఎడిటింగ్, అదిరిపోయే స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడిని అలరించడంలో ఆయన మేకింగ్ స్టైల్ ఈ జెనరేషన్ డైరెక్టర్స్ కు ఒక మోడల్. యువత ఆలోచనలకు, భాషకు, ప్రవర్తనకు దగ్గరగా ఉండే పాత్రలను సృష్టించి మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన సినిమాల్లో హీరోల హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, చివరికి వాకింగ్ స్టైల్ కూడా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ప్రతి మాస్ ప్రేక్షకుడికి తనలోని ఆవేశాన్ని పూరి హీరోల్లో చూసుకునేంతగా కనెక్ట్ చేశారు. సినిమా విజయాలు, ఓటములతో సంబంధం లేకుండా పూరి జగన్నాథ్ సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం టాలీవుడ్లో ఎప్పటికీ ప్రత్యేకమైనదే. తనదైన పవర్ ఫుల్ రైటింగ్, స్పీడ్ మేకింగ్‌తో టాలీవుడ్ స్టార్ హీరోలను మాస్ అవతారాల్లో సరికొత్తగా ఆవిష్కరించిన పూరి, నేటికీ అనేకమంది వర్ధమాన దర్శకులకు, మాస్ కంటెంట్ ప్రియులకు ఒక ఇన్సిపిరేషన్‌గా కొనసాగుతున్నారు. ఈ సినిమాతో ఆయన మళ్లీ ఇదివరకటి ఫామ్ లోకి వచ్చి అదరగొడతారని ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు.