ఆసియా గేమ్స్ సెమీ ఫైనల్ లో  భారత జట్టు

Spread the love

ఆసియా గేమ్స్  భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరగాల్సిన కీలకమైన మ్యాచ్ వర్షార్పణం కావడంతో, భారత్ ఎలాంటి ప్రయాస లేకుండానే ముందడుగేసింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో లో భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్ చేరింది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండా రద్దయింది. అక్టోబర్ 1న జరిగే సెమీస్ లో నేపాల్ లేదా శ్రీలంకతో భారత్ తలపడనుంది. డ్రా ప్రకారం నేరుగా క్వార్టర్ చేరిన భారత్ మ్యాచ్ క్యాన్సిల్ కావడంతో అత్యుత్తమ ర్యాంకింగ్ కారణంగా  రూల్స్ ప్రకారం సెమీస్ చేరింది. టీ 20 ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర్ వన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ రద్దయిన సమయంలో టోర్నమెంట్ రూల్స్ ప్రకారం మెరుగైన ర్యాంకింగ్ ఉన్న జట్టుకే సెమీస్ అర్హత దక్కుతుంది. ప్రస్తుతం ఐసీసీ అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రపంచ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండటంతో నిబంధనల ప్రకారం సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.

ఇక  పాకిస్థాన్- హాంకాంగ్ మ్యాచ్ కూడా వర్షం వలన రద్దైంది. దీంతో మెరుగైన ర్యాంకింగ్ కారణంగా పాక్ సెమీస్ లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్- మలేసియా ల మధ్య జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టుతో పాక్ సెమీస్ లో ఆడుతుంది. సెప్టెంబర్ 29న మిగిలిన రెండు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 1న సెమీస్ మ్యాచులు ఉంటాయి. అక్టోబర్ 3న ఫైనల్ మ్యాచ్ అలాగే బ్రాంజ్ మెడల్ కోసం జరిగే మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 1వ తేదీన జరగబోయే మొదటి సెమీఫైనల్‌లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నేపాల్ లేదా శ్రీలంక జట్లలో ఒకరితో పోటీపడాల్సి ఉంటుంది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్-శ్రీలంకల మధ్య విజేతగా నిలిచే జట్టుతో భారత్ ఖరారవుతుంది. భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కూడా ఇదే తరహాలో వర్షం కారణంగా సెమీఫైనల్‌కు చేరింది. పాకిస్థాన్ – హాంకాంగ్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ కూడా వర్షం వల్ల పూర్తిగా రద్దయింది. సెమీఫైనల్‌ సమరంలో పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ లేదా మలేసియాను ఎదుర్కొనే అవకాశం ఉంది. అక్టోబర్ 1న రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత, విజేతలంతా తుది సమరానికి సిద్ధమవుతారు. అక్టోబర్ 3న ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్‌తో పాటు మూడో స్థానం కోసం బ్రాంజ్ మెడల్ మ్యాచ్ కూడా అదే రోజున జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *