సాయి పల్లవి చేతిపై  టాటూపై నెట్టింట చర్చ…అసలు విషయం ఇదే..!

Spread the love

సినిమాల్లో ఎంత స్టార్ డమ్ వచ్చినా, బయట కూడా ఎంతో సింపుల్ గా, సంప్రదాయంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది నటి సాయి పల్లవి. అయితే, ఫ్యాషన్ కు, ఆడంబరాలకు ఆమడ దూరంలో ఉండే ఆమె  చేతిపై ఉన్న టాటూ గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇతర నటీమణులతో పోలిస్తే ఎంతో సహజంగా ఉండటానికే ఆమె ఎప్పుడూ ఇష్టపడుతుంది. ఒకసారి ఏకంగా రెండు కోట్ల రూపాయల ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ ఆఫర్ వస్తే, దాన్ని సున్నితంగా తిరస్కరించి తన వ్యక్తిత్వం ఏంటో నిరూపించుకుంది. రంగు, అందం అనేది సహజమైనదని, క్రీములు రాస్తే వచ్చేది కాదని కుండబద్దలు కొట్టింది. అలాంటి సింపుల్ మైండ్ సెట్ ఉన్న సాయి పల్లవి.. ఇప్పటి తరం యూత్ ఫాలో అయ్యే టాటూ కల్చర్ ను ఫాలో అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా టాటూ అంటే స్టైల్ కోసమో, ఫ్యాషన్ కోసమో వేయించుకుంటారు. కానీ సాయి పల్లవి ఆ టాటూ వేయించుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. మిగితా హీరోయిన్లతో పోల్చితే…సాయి పల్లవి క్యారెక్టర్ ఎంత యూనిక్ గా ఉంటుంది. అసలు ఆమెకు టాటూ ఉందన్న విషయం చాలా ఏళ్ల వరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే సినిమాల్లో ఆమె ఎక్కువగా ఫుల్ హాండ్స్ ఉన్న డ్రెస్సులు, చీరలు ధరిస్తుంది. ఒకవేళ హాఫ్ హాండ్స్ వేసుకున్నా, ఆ టాటూ కనిపించకుండా చాలా జాగ్రత్త పడుతుంది. కానీ సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల ప్రతి కదలికను ఫ్యాన్స్ డేగ కళ్లతో గమనిస్తూనే ఉంటారు. సాయి పల్లవి ఒక ఈవెంట్ కు హాజరైనప్పుడు, అలాగే ఒక వెకేషన్ లో ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోల్లో ఆమె కుడి చేతిపై ఉన్న ఆ టాటూ స్పష్టంగా కనిపించింది. దీంతో ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 

సాయి పల్లవి కుడి చేతి మోచేయిపై   ఒక అందమైన కాలిగ్రఫీ ఫాంట్ లో ఉన్న టాటూను ఫ్యాన్స్ జూమ్ చేసి మరీ కనిపెట్టారు. ఆ టాటూపై ఇంగ్లీష్ లో సాయి అని రాసి ఉంది. సాధారణంగా చాలామంది హీరోయిన్లు తమ కిష్టమైన వారి పేర్లు, లేదా ఏదైనా కొటేషన్స్ ను టాటూగా వేయించుకుంటారు. కానీ సాయి పల్లవి తన పేరునే టాటూగా ఎందుకు వేయించుకుని ఉంటుంది  అని అందరూ  అనుకున్నారు. అయితే ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది. ఆ టాటూలో ఉన్నది కేవలం ఆమె పేరు మాత్రమే కాదు.. అందులో ఆమె భక్తి, ఆమె కుటుంబ భావోద్వేగాలు దాగి ఉన్నాయి.  సాయి పల్లవి కుటుంబం పుట్టపర్తి సత్యసాయి బాబాకు భక్తులు. ఆ స్వామి వారిపై ఉన్న అపారమైన భక్తితోనే ఆమె తల్లిదండ్రులు పుట్టగానే ఆమెకు సాయి పల్లవి అని నామకరణం చేశారు. తన కుటుంబం ఎంతో నమ్మే ఆ భగవంతుడి పేరు ఎప్పుడూ తనతోనే ఉండాలనే ఉద్దేశ్యంతోనే, భక్తిపూర్వకంగా ఆమె తన చేతిపై సాయి అని టాటూ వేయించుకుంది. దేవుడి మీద ఉన్న అపారమైన నమ్మకం, తన తల్లిదండ్రుల విశ్వాసాలను గౌరవించే సంస్కారం ఆ ఒక్క చిన్న టాటూలో కనిపిస్తుందని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. స్టైల్ కోసం కాకుండా, కేవలం తన ఆధ్యాత్మిక భావన కోసం మాత్రమే ఆమె ఈ పచ్చబొట్టు వేయించుకుందట. సో, ఇదండీ మన లేడీ పవర్ స్టార్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేతిపై ఉన్న సీక్రెట్ టాటూ వెనుక ఉన్న అసలు కథ. సినిమా గ్లామర్ ఏమాత్రం అంటని ఆమె సింప్లిసిటీ, దేవుడిపై ఆమెకున్న భక్తి భావం నిజంగా ప్రతి ఒక్కరికీ ఆదర్శం. అందుకే ఆమెను యూత్ అంతా ఒక హీరోయిన్ లా కాకుండా, తమ ఇంట్లో సొంత అమ్మాయిలా ఓన్ చేసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *